సాక్షి, చైన్నె : చైన్నెలోని కీలకమైన పల్లికరనై చిత్తడి నేల పరిరక్షణ పేరుతో చేపట్టిన నిర్మాణ పనులు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. నిబంధనలను పక్కనబెట్టి చిత్తడి నేలలో కాంక్రీట్ కాలువలు, 10 అడుగుల ఎత్తులో కృత్రిమ కట్టలు , నడకదారులను నిర్మించడంపై స్థానిక నివాసితులు, పర్యావరణ కార్యకర్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేలచ్చేరి నుండి పెరుంబాక్కం వరకు సుమారు 1,500 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాంతం 206 జాతుల పక్షులకు నిలయంగా ఉంది. 2016లో మద్రాసు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ఆధారంగా భూ ఆక్రమణలను నిరోధించడానికి అటవీ శాఖ నాబార్డ్ బ్యాంకు ఆర్థిక సహాయంతో రూ. 47 కోట్ల వ్యయంతో 10 కిలోమీటర్ల మేర నిలుపుగోడ నిర్మాణాన్ని ప్రారంభించింది.అయితే, ఈ నిర్మాణాల వల్ల చిత్తడి నేల సహజ స్వరూపం దెబ్బతింటోందని పర్యావరణవేత్తలు ఆరోపిస్తున్నారు:


