హారర్‌ థ్రిల్లర్‌గా ఎఫ్‌ 6 బిల్డింగ్‌ హైవరి స్ట్రీట్‌ | - | Sakshi
Sakshi News home page

హారర్‌ థ్రిల్లర్‌గా ఎఫ్‌ 6 బిల్డింగ్‌ హైవరి స్ట్రీట్‌

Nov 12 2026 3:24 AM | Updated on Nov 12 2026 3:24 AM

తమిళసినిమా: ఆరా టేల్‌ స్టూడియోస్‌ పతాకంపై రూపొందుతున్న చిత్రం ఎఫ్‌ 6 బిల్డింగ్‌ హైవరి స్ట్రీట్‌. తమిళం ,మలయాళం భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా ఆభయ్‌ శంకర్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నటుడు కలేష్‌ రామనాథ్‌, నటి శ్రద్ధ గోకుల్‌ జంటగా నటించిన ఇందులో నటి ఊర్వశి సోదరి కళా రంజని హీరో తల్లిగా ముఖ్య పాత్రను పోషించారు. నటుడు రమేష్‌ తిలక్‌, తలైవాసల్‌ విజయ్‌, షర్మిళ, టి ఎస్‌ ఆర్‌ శ్రీనివాసన్‌, కుంకీ అశ్విన్‌ ,డాక్టర్‌ అమర్‌ రామచంద్రన్‌, ప్రతిభ ప్రతాప్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి శ్రీజిత్‌ ఎడవానా సంగీతాన్ని ,ప్రసాద్‌ ప్రణవం ఛాయాగ్రహణం అందిస్తున్నారు. చిత్ర షూటింగ్‌ను చైన్నె, తిరువనంతపురం ప్రాంతాల్లో నిర్వహించి పూర్తి చేసినట్లు యూనిట్‌ వర్గాలు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. దీన్ని హారర్‌ , థ్రిల్లర్‌ నేపథ్యంలో రూపొందిస్తున్నా అందమైన ప్రేమ, కుటుంబ అనుబంధాలు సూట్‌ చేసుకుంటాయని తెలిపారు. భయం, ఆనందం, భావోద్వేగాలు వంటి పలు అనుభవాలను ప్రేక్షకులకు కలిగించే చిత్రంగా ఇది ఉంటుందన్నారు. ప్రస్తుతం నిర్మానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని, ఈ సందర్భంగా చిత్ర పోస్టర్‌ను విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోందని చెప్పారు. కాగా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి చిత్రాన్ని 2027 జనవరిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement