భారీ రోడ్‌ షో... జననీరాజనం | - | Sakshi
Sakshi News home page

భారీ రోడ్‌ షో... జననీరాజనం

Nov 4 2026 1:38 AM | Updated on Nov 4 2026 1:38 AM

పెరుంతురైలో శ్రీకారం చుట్టిన

సీఎం విజయ్‌

రోడ్‌ షో ద్వారా ఈరోడ్‌లో ప్రజల్ని ఆకర్షించే ప్రయత్నం

కోయంబత్తూరు నుంచి పెరుందరైకి బయలుదేరిన సీఎం విజయ్‌కు మార్గమధ్యలో పలుచోట్ల, ఈరోడ్‌లోని విజయమంగళం టోల్‌ గేట్‌ వద్ద టీవీకే వర్గాలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. పెరుందరై కొత్త, పాత బస్‌ స్టాండ్లు , అన్నా విగ్రహం ప్రాంతాల్లో సుమారు 22 కిలోమీటర్ల మేర భారీ రోడ్‌ షో నిర్వహించారు. సీఎం విజయ్‌ తన వాహనం నుంచి రోడ్డుకు ఇరువైపులా ఉన్న వారికి అభివాదం తెలుపుతూ ముందుకు సాగారు. ప్రజలు రోడ్డుకు ఇరువైపులా బారులు తీరి దలపతి..దలపతి అంటూ నినాదాలు చేశారు. సీఎం వాహనంపై పూలవర్షం కురిపించి తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈ పర్యటన నేపథ్యంలో దాదాపు 4,500 మంది పోలీసులతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. డ్రోన్ల ఎగరవేయడంపై నిషేధం విధించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆనంద్‌,సెంగోట్టయ్యన్‌, విజయ్‌ బాలాజీ, అరుణ్‌ రాజ్‌, కలెక్టర్‌ ఎకందస్వామి తదితరులు పాల్గొన్నారు. కాగా, ఇక్కడి ప్రదర్శనలో తన చిత్రం చెక్కబడిన దుప్పటిని ఆసక్తిగా తిలకించి, దాన్ని కొనుగోలు చేసి స్వయంగా డబ్బులు సీఎం అందజేశారు. అలాగే మహిళా బృందాలు తయారుచేసిన టీని రుచి చూశారు. కాగా, సీఎం విజయ్‌తో మహిళలు సెల్పీలు, పోటోలు దిగేందుకు ఎగబడ్డారు. వారితో తన దైన శైలిలో విజయ్‌ పోటోలకు పోజులు ఇచ్చారు.

సాక్షి, చైన్నె: రాష్ట్రవ్యాప్తంగా 26,000 మహిళా స్వయం సహాయక సంఘాలకు వ్యాపార ప్రణాళికల కోసం రూ.3,000 కోట్ల బ్యాంకింగ్‌ రుణ అనుసంధాన ప్రాజెక్టును టీవీకే ప్రభుత్వం ప్రారంభించింది. ఇందులో భాగంగా మొదటి విడతగా 9,000 స్వయం సహాయక సంఘాలకు రూ.1,110 కోట్ల బ్యాంక్‌ లింకేజీ చెక్కులను స్వయంగా అందజేశారు. రెండు రోజుల్లో మిగిలిన సంఘాలకు నిధులను వేగంగా అందించాలని అధికారులను ఆదేశించారు.

బడ్జెట్‌ లక్ష్య సాధన

2026–27 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో 4.18 లక్షల స్వయం సహాయక సంఘాలకు రూ.38,000 కోట్ల రుణాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు 1.70 లక్షల సంఘాలకు రూ.16,560 కోట్ల రుణాలను అందజేసినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ కార్యక్రమంలో కేవలం రుణాలే కాకుండా మహిళల సాధికారత కోసం పలు అభివృద్ధి ఆమోద పత్రాలను పంపిణీ చేశారు. మహిళలు ఉత్పత్తి చేసిన వస్తువుల విక్రయాల కోసం షీ మార్ట్‌ కేంద్రాలు, మధి నిపుణుల ప్రదర్శన శాలలు , జిల్లా సరఫరా విక్రయ సంఘాల భవనాల నిర్మాణానికి అనుమతి పత్రాలు జారీ చేశారు. దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన కింద గ్రామీణ యువతకు ఉద్యోగాధారిత నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను ప్రారంభించేందుకు వివిధ సంస్థలకు ఆమోద పత్రాలు అందజేశారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం, వ్యవసాయేతర జీవనోపాధి రంగాల బలోపేతం కోసం కమ్యూనిటీ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌, కమ్యూనిటీ ఎంటర్‌ప్రైజ్‌ ఫండ్‌లను విడుదల చేశారు.

అత్తికడవు – అవినాసి ప్రాజెక్టుపై రైతుల విజ్ఞప్తి

పెరుమనల్లూరు సమీపంలో అత్తికడవు–అవినాసి ప్రాజెక్టు సాధన కమిటీకి చెందిన రైతులు సీఎం రాకను గమనించి రహదారి పక్కన వేచి ఉన్నారు. వారిని చూసి వెంటనే తన కాన్వాయ్‌ను ఆపాలని సీఎం ఆదేశించారు. కారు దిగి నేరుగా రైతుల వద్దకు వెళ్లి వారి సమస్యలను విన్నారు. ప్రాథమిక మ్యాప్‌లో వదిలివేయబడిన దాదాపు 1,400 చెరువులు, కుంటలను ప్రాజెక్టులో చేర్చి, రెండవ దశ పనులను తక్షణమే ప్రారంభించాలని రైతులు వినతిపత్రం అందజేశారు. స్పందించిన సీఎం విజయ్‌, అధికారులతో చర్చించి మిగిలిన చెరువులకు కూడా నీరందించేలా తగిన చర్యలు తీసుకుంటామని రైతులకు హామీ ఇచ్చారు.

ఒక వేరు – అనేక పరిశ్రమలు– ఛాయాచిత్ర ప్రదర్శన

కార్యక్రమ ప్రాంగణంలో ఒక వేరు – అనేక పరిశ్రమలు అనే శీర్షికతో ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గత 40 ఏళ్లలో తమిళనాడులో సంభవించిన మహిళా చైతన్యం, స్వయం సహాయక సంఘాల విజయగాథలు , వారి ఉత్పత్తుల స్టాళ్లను ఏర్పాటు చేశారు. సీఎం విజయ్‌ వీటిని స్వయంగా పరిశీలించి మహిళా ప్రతినిధులతో నేరుగా ముచ్చటించారు.

రూ.3,000 కోట్లతో మహిళా రుణాల పథకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement