సి. విజయభాస్కర్‌కు ఈడీ సమన్లు | - | Sakshi
Sakshi News home page

సి. విజయభాస్కర్‌కు ఈడీ సమన్లు

Nov 4 2026 1:38 AM | Updated on Nov 4 2026 1:38 AM

సాక్షి, చైన్నె : అన్నాడీఎంకే మాజీ మంత్రి, ప్రస్తుతం టీవీకేలో కీలక నేతగా ఉన్న సి. విజయ భాస్కర్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) సమన్లు జారీ చేసింది. అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన సి. విజయభాస్కర్‌, తన ఆదాయానికి మించి రూ. 35.79 కోట్ల విలువైన ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై అవినీతి నిరోధక పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన, ఆయన భార్య తమ ఆదాయంలో 54 శాతానికి పైగా ఆస్తులు కూడబెట్టారని ఆరోపణలు ఉన్నాయి. మనీ లాండరింగ్‌ నివారణ చట్టం కింద ఈ కేసుకు సంబంధించి సి. విజయభాస్కర్‌ , ఆయన భార్య రమ్యకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ శాఖ సమన్లు జారీ చేసింది. ఈ నెల 6వ తేదీన చైన్నెలోని ఈడీ కార్యాలయంలో విజయభాస్కర్‌ హాజరు కావాలని, ఆయన భార్య రమ్య వచ్చే వారం హాజరు కావాలని ఆదేశించారు. అన్నాడీఎంకే నుంచి ఇటీవలి ఎన్నికలలో విరాళి మలై ఎమ్మెల్యేగా గెలిచిన విజయ భాస్కర్‌ తన పదవికి రాజీనామా చేసి అధికార టీవీకేలో చేరారు. రానున్న ఉప ఎన్నికలో మళ్లీ పోటీ చేయడానికి సిద్ధమవుతున్న వేళ ఈడీ సమన్లు జారీ చేయడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement