సాక్షి, చైన్నె: చైన్నెలోని పట్టినంబాక్కంలో కొత్త సచివాలయాన్ని నిర్మించే ప్రతిపాదనపై వివాదం ముదిరింది. కొత్త సచివాలయ ఏర్పాటుకు సంబంధించి మంగళవారం నిర్వహించతలపెట్టిన సంప్రదింపుల సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు స్థానిక మత్స్యకార సంఘాలు స్పష్టం చేశాయి. 13 గ్రామాల నుంచి ఆగ్రహ జ్వాల ఈ సమావేశంపై బయలుద ఏరింది. అలాగే తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ పార్టీలు, ప్రజా సంఘాలు నినాదాలు అందుకోవడంతో ప్రభు త్వం కాస్త వెనక్కు తగ్గింది. పట్టినంబాక్కంలో ప్రభు త్వం తలపెట్టిన ఈ కొత్త సచివాలయ నిర్మాణాన్ని ఆ ప్రాంత మత్స్యకార సంఘాలతో పాటు పలు రాజకీ య పార్టీలు ఆది నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ పరిస్థితులలో వివాదాస్పద నిర్మాణంపై చర్చించేందుకు చైన్నె కలెక్టర్, మత్స్యశాఖ డైరెక్టర్ జనరల్ కార్యాలయంలో మంగళవారం ఉన్నత స్థాయి సంప్రదింపు ల సమావేశం ఏర్పాటు చేశారు. అయితే, మత్స్యకార సంఘాల ప్రతినిధులకు రాతపూర్వక ఆహ్వానాలు ఇవ్వకుండా కేవలం ఫోన్ కాల్స్ ద్వారా సమాచారం అందించడంపై సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. ప్రతి మత్స్యకార సంస్థ నుండి కేవలం కొద్దిమంది ప్రతినిధులు మాత్రమే సమావేశానికి హాజరుకావాలని మత్స్యశాఖ సూచించింది. గ్రామ పంచాయతీల ప్రతినిధులకు ముందస్తుగా ఎటువంటి అధికారిక, రాతపూర్వక ఆహ్వాన పత్రాలు సైతం అందనట్టు సమాచారం. దీంతో సమావేశానికి తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. సర్వత్రా నిరసనలకు సిద్ధమయ్యే విధంగా ముందుకు సాగడంతో ప్రభుత్వం ఈ సంప్రదింపుల సమావేశం, అభిప్రాయ సేకరణ విషయంలో కాస్త వెనక్కి తగ్గింది. తాజా సమావేశాన్ని వాయిదా వేస్తూ, మరో తేదీలో నిర్వహణకు సిద్ధమవుతున్నారు.


