తమిళసినిమా: నా సినీ కెరీర్ లో చాలా ముఖ్యమైన చిత్రం సైకిల్ గ్యాప్ అంటున్నారు నటి చెర్రీ అగర్వాల్. ఇంతకు ముందు తెలుగు, హిందీ, పంజాబీ, కన్నడం భాషల్లో నాయకిగా నటించిన చెర్రీ అగర్వాల్ తాజాగా సైకిల్ గ్యాప్ చిత్రం ద్వారా కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు. 1990 నాటి ప్రేమ, అమాయకత్వం వంటి అంశాలతో ఈ తరం భావోద్రేకాలను తెరపై ఆవిష్కరించే విధంగా రూపొందుతున్న చిత్రం సైకిల్ గ్యాప్. చక్కని మ్యూజికల్ కథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ ట్యూబ్ లైట్ ప్రొడక్షన్స్ పతాకంపై నవాజ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎంఆర్ భారతి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో నవాజ్ కు జంటగా పంజాబీ భామ చెర్రీ అగర్వాల్ నటిస్తున్నారు. ఈమె ఇంతకు ముందు తెలుగులో ఏప్రిల్ 28 ఏమ్ జాగ్రత్త, రామ్ అసూర్, ఐ హేట్ యూ వంటి చిత్రాల్లో నటించారు. పలు పంజాబీ, హిందీ భాషల్లో. కొన్ని వెబ్ సిరీస్ ల్లోనూ నటించారు. కాగా తాజాగా తమిళంలో నటిస్తున్న సైకిల్ గ్యాప్ చిత్రం గురించి తెలుపుతూ ప్రేమ, సంగీతం వంటి అంశాలతో వైవిధ్య భరిత కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రం ప్రేక్షకులకు మంచి అనుభూతిని కలిగిస్తుంది అని అన్నారు. ఇందులో తన పాత్ర చాలా కొత్తగా ఉంటుందన్నారు. చిత్ర యూనిట్ ఎంతగానో సహకరించారని పేర్కొన్నారు. వారితో కలిసి నటించడం మంచి అనుభవం అన్నారు. కాగా చిత్ర టీజర్ ఇటీవల విడుదలైన మంచి స్పందనను తెచ్చుకుందని చెప్పారు. సైకిల్ గ్యాప్ త్వరలోనే తెరపైకి రానుంది అని నటి చెర్రీ అగర్వాల్ పేర్కొన్నారు.
భక్తులతో
నిర్మాత
ఐసరి గణేష్,
దర్శకుడు
సుందర్ సి.


