క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Nov 2 2026 1:47 AM | Updated on Nov 2 2026 1:47 AM

దీపావళి బోనస్‌ ఇవ్వాలని ధర్నా ● కార్మికుల ధర్నా పని వేళల్లో నర్సుల నృత్యం ● వీడియో వైరల్‌ ఏడుగురు రామేశ్వరం జాలర్ల అరెస్టు ● శ్రీలంక నౌకాదళం దుశ్చర్య తెలుగు కుటుంబాలకు ప్రాధానమివ్వాలి

అన్నానగర్‌: శ్రీపెరుంబత్తూర్‌ సమీపంలో దీపావళి బోనస్‌, ఒక రోజు సెలవు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ప్రైవేట్‌ పారిశ్రామిక కార్మికులు నిరసనకు దిగారు. శ్రీపెరుంబత్తూర్‌ సమీపం వడకల్‌, వల్లం, సిబ్కట్‌ లో ఒక ప్రైవేట్‌ ఫ్యాక్టరీ నడుస్తోంది. ఇక్కడ 3,000 మందికి పైగా శాశ్వత, కాంట్రాక్ట్‌ కార్మికులు పని చేస్తున్నారు. ఈ స్థితిలో, శనివారం ఐగుగురు శాశ్వత కార్మికులు దీపావళి పండుగకు ఒకరోజు సెలవు, దీపావళి బోనస్‌ ఇవ్వాలని యాజమాన్యాన్ని కోరారు. యాజమాన్యం ఉద్యోగుల డిమాండ్ల ను పట్టించుకోనందున, 2500 మందికి పైగా కార్మికులు ఫ్యాక్టరీ లోపల ధర్నా చేస్తున్నారు. వారు ఫ్యాక్టరీ ప్రవేశద్వారాన్ని మూసివేసి, కార్మికులను తీసుకువెళ్తున్న బస్సులను బయట కు వెళ్లకుండా అడ్డుకుని, నినాదాలు చేశారు. దీపావళి బోనస్‌ చెల్లించే వరకు తమ నిరసనను విరమించబోమని వారు ఆ సమయంలో గట్టి గా చెప్పారు. దీనికి సంబంధించిన సమాచారం అందుకున్న శ్రీపెరుంబతత్తూర్‌ పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని ఫ్యాక్టరీ యాజమాన్యంతో చర్చలు జరుపుతున్నారు. ప్రైవేట్‌ ఫ్యాక్టరీ కార్మికులు నిరసన కొనసాగిస్తుండటంతో, భద్రత కల్పించేందుకు పోలీసులను మోహరించారు. కార్మికుల నిరసనతో వల్లం వడకల్‌ ప్రాంతంలో కలకలం ఏర్పడింది.

అన్నానగర్‌: కాంచీపురం ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సులు యూనిఫాంలో విధుల్లో ఉండగా తీసిన ఒక వీడియో వైరల్‌ అయి కలకలం రేపింది. ఈ విషయంపై విచారణ జరపాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. కాంచీపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి అంతర్గత, బాహ్య రోగులతో సహా వెయ్యికి పైగా ప్రజలు రోజూ చికిత్స కోసం వస్తుంటారు. ఈ ఆసుపత్రిలో 100 మందికి పైగా నర్సులు మూడు గంటల రొటేషన్‌ పద్ధతిలో పని చేస్తున్నారు. ఈ స్థితిలో ఓ హెడ్‌ నర్స్‌ ఇటీవల ఆసుపత్రి ప్రాంగణంలో ఒక స్నాతకోత్సవ కార్యక్రమం జరిగింది. ఆ సమయంలో, హెడ్‌ నర్స్‌, 15 మందికి పైగా నర్సులు యూనిఫాంలోనే ఉండి, సినిమా పాటలకు డ్యాన్స్‌ చేశారు. నర్సులు అలా డ్యాన్స్‌ ఆడుతున్న వీడియో ఇప్పుడు స్థానిక సోషల్‌ మీడియాలో వైరల్‌ అయి, తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. అధికారులు సరైన విచారణ జరిపి చర్య తీసుకోవాలని డిమాండ్‌ వ్యక్తమవుతోంది. ఈ సంఘటన ప్రభుత్వ ఆసుపత్రి వర్గాలలో కలకలం సృష్టించింది.

తిరువొత్తియూరు: రామేశ్వరం నుంచి ఎప్పటిలాగే శనివారం 500 కి పైగా జాలర్లు మోటారు పడవల లో మత్స్యశాఖ అనుమతి పత్రాలు పొంది సముద్రంలోకి చేపల వేటకు వెళ్లాయి. నెడుంతీవు సమీపంలో చేపలు పడుతుండగా, సరిహద్దు దాటి చేపలు పట్టారంటూ శ్రీలంక నౌకాదళ పెట్రోలింగ్‌ బృందం ఒక మోటారు పడవను స్వాధీనం చేసుకుని, అందులోని ఏడుగురు మత్స్యకారులను అరెస్టు చేసింది. ఇదిలా ఉండగా, ఇటీవల శ్రీలంక మత్స్యకారుడు ఒకరు తమిళనాడు మత్స్యకారులను హెచ్చరిస్తూ మాట్లాడిన ఆడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన నేపథ్యంలో, ఇప్పుడు మత్స్యకారుల అరెస్ట్‌ ఘటన రామేశ్వరం మత్స్యకారులలో తీవ్ర దిగ్భ్రాంతిని, ఆందోళనను రేకెత్తించింది. అరెస్టు చేసిన మత్స్యకారులను, పడవను తలైమన్నార్‌ నౌకాదళ స్థావరానికి తరలించి విచారణ జరుపుతున్నట్లు సమాచారం అందింది. ఈ చర్యను మత్స్యకార సంఘాలు తీవ్రంగా ఖండించాయి. అరెస్టు చేసిన మత్స్యకారులను, పడవను వెంటనే విడుదల చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు.

కొరుక్కుపేట: రాష్ట్ర జనాభాలో 40 శాతానికి పైగా తెలుగు కుటుంబాలకు విద్య, ఉపాధి, రాజకీయ రంగాలకు ప్రాధాన్యత ఇవ్వాలని స్థానిక కొడుంగైయూర్లోని సీతారామనగర్‌ తెలుగు ప్రజా సంక్షేమ సంఘం (ఎస్టీపీడబ్ల్యూఏ) కార్యదర్శి పాతూరి లక్ష్మణరావు డిమాండ్‌ చేశారు. ఈ సంఘం సర్వసభ్య సమావేశం ఆదివారం ఉదయం నిర్వహించారు. అంజలి ఘటించిన అనంతరం కార్యదర్శి నివేదికను లక్ష్మణరావు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంఘం వచ్చే ఏడాది గోల్డెన్‌ జూబ్లీ వేడుకలు జరుపుకోనుందని తెలిపారు. సంఘం తరపున కొనసాగిస్తున్న సేవా సంక్షేమ కార్యక్రమాల డంతో పాటు సభ్యులందరికి గుర్తింపు కార్డులు అందజేస్తామన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో సాధించిన తమ సంఘాల పిల్లలను, సంఘ ప్రారంభం కాలం నుంచి ఇప్పటివరకు ఉన్న సీనియర్లను గోల్డన్‌ జూబ్లీ సందర్భంగా సత్కరించుకోనునున్నట్లు తెలిపారు.

అధ్యక్షులు కొలకలేటి శ్రీనివాసకుమార్‌

టెన్త్‌, ప్లస్‌–2 పబ్లిక్‌ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన ఆరుగురు విద్యార్థులకు పురస్కారం అందజేసి అభినందించారు. సంఘ మాజీ అధ్యక్షులు, రెప్కో బ్యాంక్‌ విశ్రాంత జనరల్‌ మేనేజర్‌ వంజరపు శివయ్య వ్యాఖా, ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement