కలిసికట్టుగా పయనించాలి..! | - | Sakshi
Sakshi News home page

కలిసికట్టుగా పయనించాలి..!

Nov 2 2026 1:47 AM | Updated on Nov 2 2026 1:47 AM

కొరుక్కుపేట: చైన్నె, మైలాపూర్‌లోని అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక మందిరంలో ఆంధ్ర రాష్ట్ర 70వ అవతరణ దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో పాల్గొన్న అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక భవన నిర్వాహక కమిటీ చైర్మన్‌ కాకుటూరి అనిల్‌ కుమార్‌ రెడ్డి ప్రసంగిస్తూ, నేటి మన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. తెలుగువారికి ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని ప్రయత్నించి ఫలించకపోగా, ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రత్యేక రాష్ట్ర అవతరణకై అశువుల బాసిన అమరజీవి పుణ్యస్థలం ఈ ప్రాంగణం. ఇక్కడ రాష్ట్ర అవతరణ దినోత్సవం నిర్వహించుకోవడం మన భాగ్యంగా భావిస్తున్నాను. ఎందరో నాయకుల త్యాగ ఫలం ఇది. అందులో చెప్పుకోదగిన వారు అమరజీవి పొట్టి శ్రీరాములు. వారు సాధించిన ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి పథం వైపు పయనం సాగేందుకు ప్రతి తెలుగువాడు ప్రతిన బూనాలని పిలుపునిచ్చారు. కమిటీ సభ్యులు ఆచార్య విస్తాలి శంకర్‌ రావు, డాక్టర్‌ ఎం వి నారాయణ గుప్తా, శ్రీ గుడిమెట్ల చెన్నయ్య, డాక్టర్‌ ఏ వి శివకుమారి పాల్గొన్నారు. పొట్టి శ్రీరాములు విగ్రహానికి అందరూ నివాళులర్పించారు.

ఏఐటీఎఫ్‌ ఆధ్వర్యంలో:

భాషాప్రయుక్త రాష్ట్రాలకు కారకులైన అమరజీవిని గుర్తు చేసుకోవాలిసిన బాధ్యత మనపై ఉందని ఆల్‌ ఇండియా తెలుగు ఫెడరేషన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ సీఎంకే రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లాకు ఎస్‌పీఎస్‌ఆర్‌ అని పెట్టారని దీనిని శ్రీరాములు జిల్లా అని పెట్టాలని కోరారు. తమిళనాడులో తమిళుకు సేవ చేసే వారికి ఘనంగా సత్కరిస్తారని అలాగే ఏపీ ప్రభుత్వం కూడా చేయాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement