తిరువళ్లూరు: రాష్ట్రవ్యాప్తంగా వేర్వేరు శాఖలో ఉన్నత ఉద్యోగాల తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసి దరఖాస్తులను ఆహ్వానించింది. ఇందులో భాగంగానే జిల్లా నుంచి 11,519 మంది దరఖాస్తు చేసుకున్నారు. అభ్యర్థుల కోసం తిరువళ్లూరు, ఆవడి, పొన్నేరి, తిరుత్తణి తదితర నాలుగు తాలుకా పరిధిలోని 28 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 9,023 మంది హాజరుకాగా, 2496 మంది గైర్హాజరయ్యారు.
తిరువొత్తియూరు: తమిళనాడులో కుల ఘర్షణలను అరికట్టడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర సహాయ మంత్రి రామ్‌దాస్ అథవాలే మదురైలో పేర్కొన్నారు. మదురై ప్రభుత్వ పర్యాటక భవనంలో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల విభాగాలకు చెందిన ప్రభుత్వ శాఖలలో పెండింగ్‌లో ఉన్న ఉద్యోగ నియామకాలు, సంక్షేమ పథకాల అమలుపై శనివారం సమీక్షా సమావేశం జరిగింది. ఇందులో పాల్గొన్న కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి రామ్‌దాస్ అథవాలే, అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తమిళనాడులో అమలులో ఉన్న 69 శాతం రిజర్వేషన్ల విధానంలో వ్యత్యాసాలు ఉన్నాయి. ప్రస్తుత ముఖ్యమంత్రి విజయ్ ప్రభుత్వం ఓ మోస్తరుగా బాగానే నడుస్తున్నప్పటికీ, కుల ఘర్షణలు పెరిగిపోయాయి. కుల ఘర్షణలను అరికట్టేందుకు తమిళనాడు ప్రభుత్వం కచ్చితంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.


