బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం తుపానుగా మారుతోంది. ఈ కారణంగా
తమిళనాడు, పుదుచ్చేరిలోని తీరప్రాంత ఓడరేవులలో 1వ నంబర్ ప్రమాద హెచ్చరిక తుపాను కేజ్ (షెల్టర్)లను ఏర్పాటు చేశారు. భారత వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం,
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ–వాయువ్య దిశగా పయనిస్తూ తీవ్ర
అల్పపీడనంగా మారింది. ఇది మరింత బలపడి ’అర్నాబ్’ తుఫానుగా రూపంతరం
చెందుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ తుపాన్ మంగళవారం లేదా బుధవారం
అతి తీవ్ర తుపానుగా మార్చనుంది. 28వ తేదీ ఉదయం ఇది ఆంధ్రప్రదేశ్లోతీరాన్ని దాటే
అవకాశం ఉంది. ఈ సమయంలో గంటకు 140 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. – సాక్షి, చైన్నె
భారీ వర్షాల అలర్ట్
తుపాను ప్రభావంతో రాబోయే రెండు రోజుల్లో తమిళనాడు, పుదుచ్చేరి వ్యాప్తంగా పలుచోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. తీవ్రమైన గాలులు, సముద్రంలో ఉధృతి నేపథ్యంలో ఆదివారం నాటికి తమిళనాడులోని పంబన్, తూత్తుకుడి, నాగపట్నం, కడలూరు, కట్టుపల్లి, చైన్నె, ఎన్నూర్ ఓడరేవులతో పాటు కారైకల్, పుదుచ్చేరి ఓడరేవుల్లో 1వ నంబర్ ప్రమాద హెచ్చరిక కేజ్లను అమర్చారు.
వెల్లార్ నది ఉధృతి..
తమిళనాడులో ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పెరంబలూరు జిల్లాలోని వెల్లార్ నది పొంగిపొర్లుతోంది. తోళుదూర్ డ్యామ్ నుండి ఒక్కసారిగా నీటిని విడుదల చేయడంతో వచ్చిన ఆకస్మిక వరదల్లో చిక్కుకున్న సేలం జిల్లా అత్తూరుకు చెందిన 9 మంది కార్మికులను అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా రక్షించారు. సేలం జిల్లా అత్తూరుకు చెందిన 9 మంది సభ్యుల బందం గత 20 రోజులుగా లబ్దైకుడికాడు వద్ద ఎగ్జిబిషన్ (ప్రదర్శన) నిర్వహిస్తోంది. మూడు రోజుల క్రితం ప్రదర్శన ముగియడంతో, మినీ–లారీలో తమ సామాగ్రిని సొంత ఊరికి తరలించే పనిలో నిమగ్నమయ్యారు. న రాత్రి వెల్లార్ నది ఒడ్డున బస చేసిన వారు, ఉదయాన్నే నదికి ఒక్కసారిగా వరద పోటెత్తడంతో బయటకు రాలేక అక్కడే చిక్కుకుపోయారు.
ఉత్తర తీర జిల్లాల్లో కుండపోత వర్షాలు
నీలగిరిలో బీభత్సం నీలగిరి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. కూనూర్, కోటగిరి ప్రాంతాల్లో చెట్లు కూలిపోవడం, కొండచరియలు విరిగిపడటం వంటి ఘటనలు 62 చోట్ల నమోదయ్యాయి. భద్రతా చర్యల్లో భాగంగా నీలగిరిలోని అన్ని ప్రముఖ పర్యాటక ప్రదేశాలను మూసివేశారు. సహాయక చర్యల కోసం అరక్కోణం నుంచి 3 ఎన్డీఆర్ఎఫ్ బందాలు, చైన్నె నుంచి 2 రాష్ట్ర విపత్తు సహాయక బృందాలు రంగంలోకి దిగాయి ఇక తిరునల్వేలి టెన్ కాశీ కన్యాకుమారి తూత్తుకుడి జిల్లాల్లో కురుస్తున్న వర్షాలకు కుట్రాలం, పాపనాశం, మణిముత్తార్ జలపారాలు ఉధతంగా ప్రవహిస్తున్నాయి. పుదుచ్చేరిలో సుమారు 4 గంటల పాటు కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. వెంకటనగర్, రెయిన్బో నగర్, కృష్ణానగర్, ఈస్ట్ కోస్ట్ రోడ్డు తదితర ప్రధాన మార్గాల్లో వరద నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్కు అంతరాయం కలగడంతో ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేశారు.
మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్
బలపడే అవకాశంతో తమిళనాడులోని శివగంగతో సహా 3 జిల్లాల్లో అతి భారీ వర్షాలు, 13 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.ఈ విషయమై, చైన్నె వాతావరణ శాఖ ఒక పత్రికా ప్రకటనను జారీ చేసింది. ఈ తుపానుకు తోడుగా ఆగ్నేయ అరేబియా సముద్రం, దానిని ఆనుకుని ఉన్న లక్షద్వీప్ ప్రాంతాలపై ఉన్న అల్పపీడన ప్రాంతం ఇప్పుడు ఆగ్నేయ అరేబియా సముద్రం, దానిని ఆనుకుని ఉన్న కేరళపై అల్పపీడన ప్రాంతంగా మారింది. దీని కారణంగా, సోమ మంగళ వారాలలో తమిళనాడులోని పుదుక్కోట్టై, శివగంగ, రామనాథపురం జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కన్యాకుమారి, తిరునెల్వేలి, తూత్తుకుడి, తెన్కాసి, విరుదునగర్, మదురై, తేని, దిండిగల్, కరూర్, ట్రిచి, తంజావూర్, తిరువారూర్ ,నాగపట్టణం జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తమిళనాడులోని మిగిలిన ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. పశ్చిమ కనుమల జిల్లాల్లో, దక్షిణ తమిళనాడులోని ఇతర ప్రాంతాల్లో ఒకటి రెండు చోట్ల మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉండగా, తమిళనాడులోని మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది. చైన్నె , శివారు ప్రాంతాలలో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. నగరంలోని కొన్ని ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. తమిళనాడు తీరప్రాంతాలు, మన్నార్ గల్ఫ్ కుమారి తీర ప్రాంతాలలో ఈ గంటకు 35 నుండి 45 కిలోమీటర్ల వేగంతో, అడపాదడపా గంటకు 55 కిలోమీటర్ల వేగంతో తుఫాను సంభవించే అవకాశం ఉంది.24 గంటల్లో తమిళనాడులో వర్షపాతం రికార్డుల ప్రకారం.. తిరువణ్ణామలై జిల్లాలోని దేవికాపురంలో 20 సెంటీ మీటర్లు, నెడుంగుణంలో 18 సెంటీమీటర్లు, కళ్లకురిచ్చి జిల్లాలోని రిషివంతియం, తిరువణ్ణామలై జిల్లాలోని సేతుపట్టిలో 17 సెంటీమీటర్లు, పిళ్లిపురం జిల్లాలోని నోళళక్ ముడియనూర్, కల్లక్ ముడియనూరులో 17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక ధర్మపురి జిల్లాలో 16 సెం.మీ. కురిసింది.
మత్స్యకారులకు సలహా..
29 వ తేదీ వరకు మత్స్యకారులు ఎవ్వరూ వేటకు సముద్రంలోకి వెళ్లకూడదని సముద్ర మత్స్య శాఖ స్పష్టమైన నిషేధం విధించింది. ఇప్పటికే వేటకు వెళ్లిన వారు తీరంలో ఉన్నవారు తమ పడవలు, చేపల వేట పరికరాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించింది.
డ్యామ్ నుండి భారీగా నీటి విడుదల
తోళుదూర్ డ్యామ్ నుండి ఉదయం సుమారు 5 గంటల ప్రాంతంలో 30,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయడంతో వెల్లార్ నది ఉధృతంగా మారింది. బాధితుల సమాచారం మేరకు వేపూర్, పెరంబలూర్, సెంతురై ప్రాంతాలకు చెందిన మూడు అగ్నిమాపక దళాలు చంద్రమోహన్, త్యాగరాజన్ల నేతృత్వంలో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నాయి. తాళ్ల సహాయంతో సాహసోపేతంగా శ్రమించి 9 మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. నీటిమట్టం చాలా ఎక్కువగా ఉండటంతో వారి మినీ–లారీ నది మధ్యలోనే ఉండిపోయింది. నదిలో నీటి ఉధృతి తగ్గితే తప్ప లారీని బయటకు తీయడం సాధ్యం కాదని అధికారులు తెలిపారు. ఈశాన్య రుతుపవనాలు తీవ్ర రూపం దాల్చినందున వేప్పన్ధట్టై (కల్లార్), కున్నం (వెల్లార్) నదీ పరివాహక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర అప్రమత్తంగా ఉండాలని, వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని పెరంబలూరు కలెక్టర్ అబ్దుల్ రజిక్ సూచించారు.


