పళ్ళిపట్టు: పెరియపాళయత్తమ్మన్ ఆలయ మహాకుంభాభిషేకం ఆదివారం ఉదయం కోలాహలంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆర్కేపేట యూనియన్ ఎస్‌వీజీ.పురం సమత్తువపురంలో పెరియపాళయత్తమ్మన్ ఆలయం నిర్మించారు. ఆలయంలో వినాయకుడు,. మురుగన్ సన్నిధులను సైతం ఏర్పాటు చేశారు. ఆలయ నిర్మాణపు పనులు పూర్తి కావడంతో శనివారం గణపతి పూజలతో మహాకుంభాభిషేకం పూజలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో యాగశాల ఏర్పా టు చేసి నిత్యహోమ పూజలు చేపట్టారు. ఆదివారం ఉదయం హామపూజలు చేపట్టి మహాపూర్ణాహుతి హామం అనంతరం మేళ తాళాలు నడుమ పవిత్ర పుణ్యతీర్ధాల కలచాలు బయల్దేరి ఆలయ గోపుర కలశానికి పుణ్యతీర్థాలతో మహాకుంభాభిషేకం నిర్వహించారు. అనంతరం అమ్మవారికి, వినాయ కుడు, మురుగన్‌కు అభిషేక పూజలతు చేపట్టి కర్పూర హారతులతో స్వామికి హారతి పూజలు చేపట్టి భక్తులు దర్శించుకున్నారు. ఆలయ నిర్వాహకులు భక్తులకు ప్రసాదాలతో పాటు అన్నదానం చేశారు.


