తమిళసినిమా: మంచి కంటెంట్‌తో కూడిన వైవిధ్యభరిత కథా చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుందన్నది హైకూ చిత్రం మరోసారి నిరూపించిందని ఆ చిత్ర నిర్మాత డా. అరుళానందు, మ్యాథ్యూ అరుళానందు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. విజన్ సినిమా హౌస్ పతాకంపై వీరు ఇంతకు ముందు జ్యో వంటి విజయవంతమైన చిత్రాన్ని నిరిమంచిన ఈ నిర్మాతలు ఆ తరువాత కోళిపన్నై సెల్లదురై వంటి విమర్శకుల ప్రశంసలు అందుకున్న చిత్రాన్ని నిర్మించారు. తాజాగా హైకూ అనే విభిన్న ప్రేమ కథా చిత్రాన్ని నిర్మించారు. యువరాజ్ చిన్నసామి కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన ఈ చిత్రంలో నటుడు ఏకన్,నటి శ్రీదేవి,ఫెమినా జార్జ్ హీరోహీరోయిన్లుగా నటించారు. అదిర్చి అరుణ్,సుబ్రమణియ సేతు,ఆదియమాన్,మైమ్‌గోపి, ఇందుమతి మణికంఠన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సిద్దుకుమార్ సంగీతాన్ని, ప్రియేశ్ గురుసామి ఛాయాగ్రహణం అందించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న హైకూ చిత్రం ఈ నెల 23వ తేదీన విడుదలయ్యింది. కాగా చిత్రాన్ని ముందుగా దక్షాణాది వ్యాప్తంగా 150కి పైగా ధియేటర్లలో విడుదల చేసినట్లు చెప్పారు. చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోందనే ఆనందాన్ని వ్యక్తం చేశారు. కాగా ఒక పక్క రజనీకాంత్ హీరోగా నటించిన జైలర్– 2 చిత్రం విజయవంతంగా ప్రదర్శింపబడుతుండగా విభిన్న ప్రేమ కథా చిత్రంగా రూపొందించిన తమ హైకూ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించడం తమిళ చిత్రాలపై మరింత నమ్మకాన్ని కలిగించిందన్నారు. ఈ సందర్భంగా తమిళనాడులో హైకూ చిత్రాన్ని విడుదల చేసిన శక్తిఫిలింస్ అధినేత శక్తివేలన్, చిత్ర యూనిట్ కు కృతజ్ఞతలు తెలిపారు.
తమిళసినిమా: క్రేజీ నటీమణు ల్లో త్రిష ఒకరు అని ప్రత్యకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. కోలీవుడ్, టాలీవుడ్, మాలీవుడ్, శాండిల్‌వుడ్, బాలీవుడ్ అంటూ పాన్ ఇండియా ప్రేక్షకులకు సుపరిచితురాలైన త్రిష కథానాయకిగా రెండు దశాబ్దాలు దాటి రాణిస్తున్నారు. అయితే తమిళంలో సూర్యకు జంటగా నటించిన కరుప్పు చిత్రం తరువాత మరో కొత్త చిత్రానికి సైన్ చేసినట్లు సమాచారం లేదు. అదే విధంగా తెలుగులో చిరంజీవికి జంటగా నటించిన విశ్వంభర, మలయాళంలో మోహన్‌లాల్‌కు జంటగా నటించిన రామ్ చిత్రాల నిర్మాణం ప్రారంభం అయ్యి చాలా కాలం అయినా, వాటి విడుదలలో జాప్యం జరుగుతూనే ఉంది. ఒకపోతే ప్రస్తుతం ఈ సంచలన నటి కొత్త చిత్రాలను అంగీకరించకపోవడంతో రకరకాల వార్తలు సామాజిక మాధ్యమాల్లో దొర్లుతున్నాయి. ముఖ్యంగా రాజకీయాలు ఈ బ్యూటీ చుట్టూనే తిరుగుతున్నాయి. ముఖ్యమంత్రి జోసఫ్ విజయ్‌కు స్నేహితురాలు అనే పేరు ఉన్న త్రిష రాజకీయరంగ ప్రవేశం తధ్యం అనీ, ఉపముఖ్యమంత్రి కూడా అయ్యే అవకాశం ఉందనే ప్రచారం చాలా కాలంగా జరుగుతోంది. కాగా ఈ భామకు ప్రజల్లో ఎంత క్రేజ్ ఉందన్నది మరోసారి రుజువైంది. త్రిష ఇటీవల కోయంబత్తూర్‌లో ఓ మొబైల్ షాప్ ప్రారంభోత్సవానికి వెళ్లారు. ఈ విషయం తెలిసిన కోయంబతూర్ ప్రజలు, అభిమానులు త్రిషను చూడటానికి ఏకంగా విమానాశ్రయానికే పరుగులు తీశారు. అంతే కాదు కోయంబత్తూర్ విమానాశ్రయం నుంచి కారులో బయలుదేరిన త్రిషకు రోడ్డు పొడుగునా అభిమానులు వందల సంఖ్యలో పరుగులు తీశారు. దీంతో ఆమె రెట్టింపు ఉత్సాహంతో ఓపెన్ కారులో చిరునవ్వులు చిందిస్తూ అందరికీ అభివాదం చేస్తూ పయనించారు. త్రిష ఓపెన్ కారులో పయనించడంతో ప్రజాజీవనానికి అంతరాయం కలిగిందనేది పక్కన పెడితే ఆమెకు ప్రజల్లో ఉన్న క్రేజ్ గురించే ప్రధానాంశంగా మారింది. ఇదిలా ఉంటే కోయంబత్తూర్ విమానాశ్రయంలో మీరు రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారా ? అన్న మీడియా వారి ప్రశ్నకు మందహాసాన్ని విసిరి అక్కడ నుంచి ముందుకు సాగారు.
దీంతో త్రిష మందహాసంలో మర్మమేమిటి ? అనే ప్రశ్న తలెత్తుతోంది.
అభిమానుల
సందోహంలో నటి త్రిష
ఆ మందహాసంలో
మర్మమేమిటి?


