ఓటు వేసిన వాళ్లూ ఫిర్యాదు చేస్తున్నారు! | - | Sakshi
Sakshi News home page

ఓటు వేసిన వాళ్లూ ఫిర్యాదు చేస్తున్నారు!

Oct 26 2026 2:28 AM | Updated on Oct 26 2026 2:28 AM

● టీవీకే ప్రభుత్వంపై మాజీ సీఎం ఎం.కే. స్టాలిన్‌ తీవ్ర విమర్శలు

సాక్షి, చైన్నె: తమిళనాడులోని టీవీకే ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎం.కే. స్టాలిన్‌ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఓటు వేయని వారే కాకుండా, ఇప్పుడు ఈ ప్రభుత్వానికి ఓటు వేసి గెలిపించిన ప్రజలు కూడా తీవ్ర అసంతప్తితో ఫిర్యాదులు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిపాలన తీరుకు ఇదే నిదర్శనం అని ఆయన వ్యాఖ్యానించారు. మాజీ మంత్రి కే.కే.ఎస్‌.ఆర్‌. రామచంద్రన్‌ నివాసంలో జరిగిన ఒక వివాహ వేడుకలో ఎం.కే. స్టాలిన్‌ పాల్గొని మాట్లాడారు.

గతానికి, ఇప్పటికీ తేడా..

తానును ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించే సమయంలో.. ఓటు వేయని వారు కూడా అయ్యో వేయలేకపోయామే అని పశ్చాత్తాపపడేలా పాలన ఉంటుందని చెప్పానని గుర్తు చేశారు. అయితే నేడు పరిస్థితి దానికి పూర్తిగా విరుద్ధంగా మారిందన్నారు. ఓటు వేసిన వారు కూడా ప్రభుత్వంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.

పరిపాలనా వైఫల్యాలు – నేరాలు:

రాష్ట్రంలో నిత్యావసర ధరల పెరుగుదల, పరిపాలనా వైఫల్యం ,లైంగిక నేరాలు రోజువారీ అంశాలుగా మారిపోయాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. దినపత్రికలు, టీవీలు, సోషల్‌ మీడియా తెరిస్తే చాలు... హత్యలు, దోపిడీలు, దొంగతనాలు , అత్యాచారాల వార్తలు లేని రోజంటూ లేదన్నారు. గత కొద్ది రోజులుగా చిన్న పిల్లల అపహరణ సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయ ని ఆందోళన వ్యక్తం చేశారు.. విద్యుత్‌ కోతలు పెరిగిపోయాయను’లయన్‌ వుమన్‌’ అనే పేరుతో ఒక సైన్యాన్ని సృష్టించిన పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే... ఆ సైన్యాన్ని రక్షించడానికి మరో కొత్త బలగాన్ని మోహరించాల్సి వస్తోందని మండి పడ్డారు.

రాజకీయ పోటీపై వ్యాఖ్య:

సీఎం పదవిని ఆశిస్తున్న కొందరు నాయకులు గతంలో రెండు పార్టీల మధ్యే పోటీ అని చెప్పారని పేర్కొంటూ, తాను అప్పుడే అన్నానని. పోటీ అనేది విద్యుత్‌ కోతలకు, కొడవళ్లతో జరిగే హింసకూ మధ్య ఈ రాష్ట్రంలో ఉందని ధ్వజమెత్తారు. ప్రస్తుతం అది మారిపోయి, మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు , లైంగిక వేధింపులకు మధ్య పోటీగా మారిందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ప్రజలు తీవ్ర నిరాశతో ఉన్నారని, ఈ దుష్టశక్తుల నిజ స్వరూపం ప్రజలందరికీ బాగా తెలుసని ఎం.కే. స్టాలిన్‌ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement