చైన్నెలో తోట తరని కళాఖండాల ప్రదర్శన | - | Sakshi
Sakshi News home page

చైన్నెలో తోట తరని కళాఖండాల ప్రదర్శన

Oct 26 2026 2:28 AM | Updated on Oct 26 2026 2:28 AM

● ఐదు దశాబ్దాల కళా ప్రస్థానానికి ప్రతిరూపం

సాక్షి,చైన్నె : ప్రముఖ కళాకారుడు పద్మశ్రీ తోట తరనీ ఐదు దశాబ్దాల కళా ప్రస్థానాన్ని ప్రతిబింబించే చిత్రకళా ప్రదర్శన చైన్నెలోని లలిత కళా అకాడమీలో ఆదివారం ప్రారంభమైంది. ఆర్ట్‌వరల్డ్‌–సరళాస్‌ ఆర్ట్‌ ఇంటర్నేషనల్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ప్రదర్శనలో 1969 నుంచి ఇప్పటివరకు ఆయన రూపొందించిన 280కి పైగా కళాఖండాలను ప్రద ర్శనకు ఉంచారు. ప్రకృతి, వాస్తుశిల్పం, భారతీయ సంప్రదాయాలు, పురాణాలు, సంగీతం తదితర అంశాలు ఈ చిత్రాల్లో ప్రతిబింభించాయి. ది కేసీపీ లిమిటెడ్‌ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కవితా దత్‌ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా తోట తరనీ జీవితం, కళా ప్రస్థానంపై డాక్టర్‌ అష్రఫ్‌ ఎస్‌. భగత్‌ రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. జలవర్ణాలు, తైలవర్ణాలు, యాక్రిలిక్‌, పాస్టెల్స్‌, కొల్లాజ్‌ వంటి విభిన్న మాధ్యమాల్లో తోట తరణి తన కళా ప్రతిభను చాటుకున్నారు. ఒక అంశంపై లోతైన అధ్యయనం చేస్తూ, ఒక్కో ఇతివృత్తంపై 50 నుంచి 100 చిత్రాల వరకు రూపొందించడం ఆయన ప్రత్యేకత. సినీ రంగంలో ఆర్ట్‌ డైరెక్టర్‌గా గుర్తింపు పొందిన ఆయన, లలిత కళల్లోనూ తనదైన శైలిని ఆవిష్కరించారు. తన 16వ ఏట రూపొందించిన చిత్రాలతో సహా వివిధ దశల్లో వేసిన కళాఖండాలను ఈ ప్రదర్శనలో పొందుపరిచినట్లు తోట తరణి తెలిపారు. ఐదు దశాబ్దాల తర్వాత కూడా కొత్త ప్రయోగాలు చేయాలనే ఆసక్తి తనలో కొనసాగుతోందన్నారు. ఈ ప్రదర్శన 30వ తేదీ వరకు సందర్శకులకు అందుబాటులో ఉంటుంది.

ప్రదర్శన ప్రారంభోత్సవంలో డా. ప్రీతారెడ్డి, కవితా దత్‌, డా. అష్రఫ్‌ ఎస్‌. భగత్‌, పద్మశ్రీ తోట తరణిని తదితరులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement