తమిళసినిమా: ఇంతకు ముందు నక్కల జాతికి సన్నివేశాలు కొన్ని సన్నివేశాలు చోటు చేసుకున్నా, పూర్తిగా వారి జీవన విధానాన్ని ఆవిష్కరించే కథా చిత్రాలు రాలేదు. కాగా తాజాగా అలాంటి అలాంటి ఇతి వృత్తంతో రూపొందిన చిత్రం సింగారం.నటి యోగిబాబు కథానాయకుడిగా నటించిన ఇందులో ఎంఎస్.భాస్కర్, వేలా రామమూర్తి, మరియా విన్సెంట్, శ్యామ్స్, ఆర్తీ గణేశ్, మనోబాలా, కల్కీ, మారిముత్తు, బడవా గోపి, సెండ్రాయన్, డీఎస్‌ఆర్,దీపా శంకర్,సబితారాయ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. రాక్ ప్రొడక్షన్స్ పతాకంపై ఏఎస్.రమణ బాలాజీ, పద్మావతి గాంధీ కలిసి నిర్మించిన ఈ చిత్రానికి కేవీ.కథిరవేలు కథ, కథనం,దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. శ్యామ్ సీఎస్ సంగీతాన్ని, ప్రసన్న ఎస్.కుమార్ ఛాయాగ్రహణం అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ నెల 30వ తేదీన తెరపైకి రానుంది. ఈ సందర్భంగా చైన్నెలోని ప్రసాద్‌ల్యాబ్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. చిత్ర దర్శకుడు కేవీ.కదిరవేలు మాట్లాడుతూ నక్కలజాతి సామాజక వర్గం జీవన విధానం, సమాజంలో వారు ఎదుర్కొనే సమస్యలు, అణగవేత వంటి పలు ఆసక్తికరమైన అంశాలతో రాజకీయాలను జోడించి రూపొందించిన కథా చిత్రం సింగారం అని తెలిపారు. నక్కల జాతికి చెందిన ఒక వ్యక్తి రాజకీయ రంగప్రవేశం చేసి శాసన సభ్యుడిగా పోటీ చేసి గెలిచాడా? ఆ తరువాత జరిగే పరిణామాలేమిటీ వంటి పలు ఆసక్తికరమైన అంశాలతో కూడిన వినోదభరిత కథా చిత్రంగా సింగారం ఉంటుందన్నారు. నటుడు యోగిబాబు మాట్లాడుతూ ఈ చిత్రంలో నటించడానికి అవకాశం కలిగించిన దర్శకుడు కేవీ.కదిరవేలుకు, నిర్మాతలు రమణా బాలాజీ తదితర చిత్ర యూనిట్‌కు కృతజ్ఞలు అన్నారు. తనను నమ్మి ఇచ్చిన పాత్రకు న్యాయం చేశాననే భావిస్తున్నానన్నారు. ఇందులో నటించిన దివంగత నటుడు మనోబాలా, మారిముత్తును స్మరించుకుంటున్నట్లు చెప్పారు. ముఖ్యంగా నటుడు మనోబాలా తనకు చాలా సపోర్టుగా ఉండేవారనీ, సింగారం చిత్రం సంతృప్తిగా వచ్చిందని అన్నారు. చిత్రం ఈ నెల 30వ తేదీన తెరపైకి వస్తోందని యోగిబాబు పేర్కొన్నారు.


