తమిళసినిమా: కొన్ని చిత్రాల టైటిల్సే ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తాయి. అలాంటి ఆసక్తికరమైన టైటిల్‌తో రూ పొందుతున్న చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది.ఈ చిత్రం పేరే కమల్ శ్రీదేవి. ఇంతకు నటుడు కమలహాసన్,శ్రీదేవి జంటగా నటించిన పలు చిత్రాలు ఘన విజయా న్ని సాధించిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు వారి పేర్లతో చిత్రాన్ని సౌందర్య రజనీకాంత్‌కు చెందిన జియోన్ ఫిలింస్,ఎంఆర్‌పీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ అధినేతలు పసిలియాన్ నజరేత్, మహేశ్‌రాజ్ పసిలియాన్ కలిసి నిర్మిస్తున్నారు. డాన్సింగ్ కింగ్ ప్రభుదేవా, నటి సిమ్రాన్ జంటగా నటిస్తున్న ఇందులో మిథున్ జైశంకర్, స్మేకా తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కృష్ణానంథ్ కొట్టారపట్టు కథ,దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ను మూనారు, చైన్నె ప్రాంతాల్లో నిర్వహించి పూర్తి చేసినట్లు యూనిట్ సభ్యులు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఇది కుటుంబ నేపధ్యంలో సాగే విభి న్న ప్రేమ కథా చిత్రంగా ఉంటుందని తెలిపారు. తమిళంలో పలు వైవిధ్యభరిత కథా చిత్రాలను నిర్మిస్తున్న సంస్థ ఎంఆర్‌పీ ఎంటర్‌టెయిన్‌మెంట్. ఈ సంస్థ ఇంతకు ముందు గుడ్‌నైట్, లవర్, ట్యూరిస్ట్ ఫ్యామిలి వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిందన్నదిగమనార్హం. అదే విధంగా జియోన్ ఫిలింస్, ఎంఆర్‌పీ ఎంటర్ టెయిన్‌మెంట్ సంస్థలు ఇంతకు ముందు నిర్మించిన విత్ లవ్ చిత్రం మంచి విజయాన్ని సాధించడంతో తాజా చిత్రం కమల్ సిమ్రాన్‌పై భారీ అంశనా లు నెలకొంటున్నాయి. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రానికి జీవీ. ప్రకాశ్‌కుమా ర్ సంగీతాన్ని, చరణ్ వేలాయుధం ఛాయాగ్రహణం అందిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు యూనిట్ వర్గాలు పేర్కొన్నారు.
ప్రభుదేవా
నటి సిమ్రాన్


