తిరువళ్లూరులో భారీ వర్షాలు | - | Sakshi
Sakshi News home page

తిరువళ్లూరులో భారీ వర్షాలు

Oct 26 2026 2:28 AM | Updated on Oct 26 2026 2:28 AM

తిరువళ్లూరు: జిల్లా వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా పడడంతో జనజీవనం స్తంభించింది. గత కొద్ది రోజుల నుంచి జిల్లా వ్యాప్తంగా ఎండలు దంచి కొట్టి ఉక్కపోత వాతావరణం కనిపించింది. అయితే గత రెండు రోజుల నుంచి వాతావరణంలో మార్పులు వచ్చి వర్షాలు పడడం ప్రారంభించింది. శనివారం రాత్రి నుంచి ప్రారంభమైన వర్షం ఆదివారం సాయంత్రం వరకు ఎడతెరిపి లేకుండా విస్తారంగా కురుస్తోంది. మబ్బులు కమ్ముకోవడంతో చీకటి మారిన క్రమంలో వాహనాలు లైట్లుతో నడిచాయి. బజారువీది, వీరరాఘవుని ఆలయం, జేఎన్‌ రోడ్డు తదితర ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో జనజీవనం స్తంభించింది. వర్షం కారణంగా రద్దీగా వుండే బజారువీధితో సహా పలు ప్రాంతాలు బోసిపోయింది. పలు ప్రాంతాల్లో వర్షపు నీటితో కలిసి మురికి నీరు రోడ్డుపైకి రావడంతో దుర్వాసన వెదజల్లింది. మొత్తానికి జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షాలతో వాతావరణం చల్లబడింది. వర్షాలు కురుస్తున్న క్రమంలో వ్యవసాయ పనులు సైతం ప్రారంభమయ్యింది. ప్రధాన రిజర్వాయర్‌కు సైతం నీరు రాకపెరిగి నీటి మట్టం సైతం స్వల్పంగా పెరుగుతూ వుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement