తిరుచ్చికి కొత్త పోలీస్‌ కమిషనర్‌ | - | Sakshi
Sakshi News home page

తిరుచ్చికి కొత్త పోలీస్‌ కమిషనర్‌

Oct 23 2026 1:57 AM | Updated on Oct 23 2026 1:57 AM

న్యూస్‌రీల్‌

– ముగ్గురు ఐపీఎస్‌ అధికారుల బదిలీ

సాక్షి, చైన్నె: తిరుచ్చి పోలీస్‌ కమిషనర్‌తో పాటు ముగ్గురు పోలీస్‌ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు హోంశాఖ కార్యదర్శి ఎ. కార్తీక్‌ ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు చైన్నె ఆర్థిక నేర విభాగం ఐజీగా బాధ్యతలు నిర్వహిస్తున్న సంతోష్‌ కుమార్‌ను చైన్నె నందనంలోని పౌర సరఫరాల సీఐడీ (సివిల్‌ సప్లైస్‌ సీఐడీ) ఐజీగా నియమించారు. ఇక్కడ పనిచేసిన రూపేష్‌ కుమార్‌ మీనాను తిరు చ్చి కొత్త పోలీస్‌ కమిషనర్‌గా బదిలీ చేశారు. తిరుచ్చి కమిషనర్‌గా ఉన్న ఎన్‌ కామినిని పోలీస్‌ శాఖ అడ్మినిస్ట్రేషన్‌ (పరిపాలన) విభా గం ఐజీగా నియమించారు. ఇక్కడున్న ఎ. రాధికాను వెయిటింగ్‌లో ఉంచారు. కాగా జెమ్‌ వీర మణి కేసుకు సంబంధించి, చైన్నె సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ అదనపు కమిషనర్‌గా, ప్రస్తుత అడ్మినిస్ట్రేషన్‌ ఐజీగా ఉన్న రాధికను కూడా స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌ విచారించింది. వీరమణిపై ఆరోపణలు వచ్చిన సమయంలో ఐజీ రాధిక దాదాపు 5 నెలలకు పైగా సుదీర్ఘ సెలవులో ఉన్నారు. దీంతో ఆమైపె సిట్‌ అధికారులకు ఎలాంటి అనుమానం రాలేదు. అయినప్పటికీ, విచారణలో ఎటువంటి అడ్డంకులు కలగకూడద నే ఉద్దేశంతోనే ఆమెను ఆ బాధ్యతల నుంచి తప్పించినట్టు సమాచారాలు వెలువడ్డాయి.

సీనియర్‌ గాయకుడు

ఆర్‌ .కృష్ణరాజ్‌ కన్నుమూత

తమిళసినిమా: సీనియర్‌ గాయకుడు ఆర్‌.కృష్ణరాజ్‌ (75) గురువారం ఉదయం చైన్నెలోని స్వగృహంలో వృద్ధాప్య సంబంధ సమస్యల తో కన్నుమూశారు. 1989లో గాయకుడిగా పరిచయం అయిన ఈయన దివంగత సంగీత దర్శకుడు దేవా, ఏఆర్‌ రెహమాన్‌, జీవీ. ప్రకాష్‌ కుమార్‌ వంటి పలువురు ప్రముఖ సంగీత దర్శకత్వంలో పాడి పేరు గాంచారు. ఆర్‌.కృష్ణరాజ్‌ 3000లకు పైగా పాటలు పాడా రు. ఈయన పాడిన పలు భక్తిగితాలు సంగీత ప్రియులను అల రించాయి. ముఖ్యంగా దేవా సంగీత దర్శకత్వం వహించిన కాదల్‌ కోట్టై చిత్రంలో చోటు చేసుకున్న వెళ్లరికా పింజు వెళ్లరి కా, పొర్కాలం చిత్రంలో తంజావూరు మన్ను ఎడుత్తు మొదలగు పలు పాటలు బాగా ప్రాచుర్యం పొందాయి.తంజావూరు మన్ను ఎడుత్తు పాటకు గానూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ గాయకుడు అవార్డు, కళైమామణి అవార్డులను అందుకున్నారు. సంగీత దర్శకుడు దేవా సంగీతంలో అత్యధికంగా పాటలుపాడారు. స్థానిక రామా పురం, అంబాళ్‌ నగర్‌, అనెక్స్‌, కామరాజర్‌ వీధి లో నివశిసించిన గాయకుడు ఆర్‌.కృష్ణరాజ్‌ భౌతి క కాయాన్ని సినీ ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం ఉంచారు. ఈయన మృతికి పలువురు సినీ ప్రముఖులు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశా రు. కాగా కృష్ణరాజ్‌ పార్థీవదేహాన్ని శుక్రవారం ఉదయం ఆయన సొంత ఊరు సేలం సమీపంలోని వేంపడి దాళం అనే గ్రామానికి తరలించి అక్కడ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

క్రీడాకారిణులకు రూ. 30 లక్షల నగదు బహుమతి

సాక్షి, చైన్నె : జపాన్‌లో జరుగుతున్న 5వ పారా ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన తమిళనాడు క్రీడాకారిణులు మనీషా రామదాస్‌ , నిత్యాశ్రీను సీఎం ఎస్‌. జోసెఫ్‌ విజయ్‌ అభినందించారు. వారి ప్రతిభను గుర్తించి ఒక్కొక్కరికి రూ. 30 లక్షల చొప్పున ప్రోత్సాహక బహుమతిని ప్రకటించారు.బాడ్మింటన్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో కాంస్య పతకం గెలుచుకున్న భారత జట్టులో సభ్యురాలిగా ఉన్న తమిళనాడు అథ్లెట్‌ మనీషా రామదాస్‌కు సీఎం విజయ్‌ అభినందనలు తెలిపారు. ఆమెకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ. 30 లక్షల నగదు బహుమతి అందజేయనున్నట్లు వెల్లడించారు. అలాగే, బాడ్మింటన్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో కాంస్య పతకం సాధించిన భారత జట్టులో సభ్యురాలైన తమిళనాడు క్రీడాకారిణి నిత్యాశ్రీని సీఎం అభినందించారు. పట్టుదల, శ్రమతో పతకం సాధించిన ఆమెకు ప్రభుత్వం తరఫున రూ. 30 లక్షల భారీ ప్రోత్సాహకం అందించనున్నట్లు ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement