కలెక్టర్‌ వాహనం ఢీకొని వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌ వాహనం ఢీకొని వ్యక్తి మృతి

Oct 23 2026 1:57 AM | Updated on Oct 23 2026 1:57 AM

సేలం: ఈరోడ్‌ జిల్లాలోని గోపిచెట్టిపాలయం సమీపంలోని వెల్లంగోయిల్‌ ప్రాంతానికి చెందిన షణ్ముగం (52), తన డ్రైవింగ్‌ లైసెన్సును పునరుద్ధరించుకోవడానికి గురువారం గోపిచెట్టిపాలయం ప్రాంతీయ రవాణా కార్యాలయానికి వెళ్లాడు. ఆ తర్వాత, ఒక జెరాక్స్‌ తెచ్చుకోవడానికి ద్విచక్ర వాహనంపై వెళ్లాడు. వెల్లం పాలయం డివిజన్‌ సమీపంలో రోడ్డు దాటుతుండగా, గోపిచెట్టిపాలయం–ఈరోడ్‌ వైపు వస్తున్న జిల్లా కలెక్టర్‌ ప్రభుత్వ వాహనం అకస్మాత్తుగా షణ్ముగం ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంతో దిగ్భ్రాంతికి గురైన కలెక్టర్‌ కందస్వామి, ప్రజలు, భద్రతా సిబ్బంది వెంటనే అతడిని రక్షించి చికిత్స కోసం గోపిచెట్టిపాల యం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో షణ్ముగాన్ని పరీక్షించిన వైద్యులు, అత ను అప్పటికే మరణించినట్లు ప్రకటించారు. ఘటనపై సమాచారం అందుకున్న గోపిచెట్టిపాలయం పోలీసులు, కలెక్టర్‌ వాహన డ్రైవర్‌ వినోత్‌ (35)పై కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement