చైన్నెలో టేబుల్‌ టెన్నిస్‌ సంబరం | - | Sakshi
Sakshi News home page

చైన్నెలో టేబుల్‌ టెన్నిస్‌ సంబరం

Oct 23 2026 1:57 AM | Updated on Oct 23 2026 1:57 AM

– నేటి నుంచి డబ్ల్యూటీటీ సిరీస్‌

సాక్షి, చైన్నె: టేబుల్‌ టెన్నిస్‌ క్రీడా రంగానికి ప్రధాన కేంద్రంగా గుర్తింపు పొందిన చైన్నె నగరం మరో అంతర్జాతీయ టోర్నమెంట్‌కు వేదికగా నిలవబోతోంది. తమిళనాడు స్పోర్ట్స్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ సమర్పణలో ఈ నెల 23 నుండి నవంబర్‌ 1 వరకు మేలకొట్టయూర్‌లోని తమిళనాడు ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ స్పోర్ట్స్‌ యూనివర్సిటీ ప్రాంగణంలో డబ్ల్యూటీటీ యూత్‌ కంటెండర్‌, డబ్ల్యూటీటీ ఫీడర్‌ చైన్నె 2026 టోర్నమెంట్‌లు జరగనున్నాయి. గత 19 ఈవెంట్‌ ఇది కావడం విశేషం. తమిళనాడులోని కొత్త ప్రభుత్వం డ్రీమ్‌ ఒలింపిక్స్‌ 2036 లక్ష్య సాధన దిశగా ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌ను నిర్వహిస్తోంది. కాగా ఈ టోర్నీలో మొత్తం 13 దేశాల నుంచి 334 మంది క్రీడాకారులు (తమిళనాడు నుంచి 36 మందికి పైగా) పాల్గొంటున్నారు. యూత్‌ కంటెండర్‌ అండర్‌ 11 నుంచి 19 ఏళ్ల వారు 210 మంది ఈనెల 23 నుంచి 26 వతేది వరకు తమ ప్రతిభను చాటనున్నారు. అండర్‌ 13–17 సింగిల్స్‌ పోటీలు 23 , 24 తేదీలలో, అండర్‌ 11 15 కేటగిరి, అండర్‌ 15–19 కేటగిరి మిక్స్డ్‌ డబుల్‌స మ్యాచ్‌లో 25,26 తేదీలలో జరగనున్నాయి. ఫీడర్‌ సీరిస్‌ పోటీలు ఈనెల 28 నుంచి నవంబర్‌ 1వ తేదీవ రకు జరుగుతాయి. ఇందులో 124 మంది క్రీడాకారులు తమ సత్తా చాటనున్నారు. 28,29 తేదీలలో క్వాలిఫైయింగ్‌ రౌండ్లు, 30,31 తేదీలలో నాకౌట్‌ మ్యాచ్‌లు, నవంబర్‌ 1వ తేదీన ఫైనల్స్‌ జరగనున్నాయి.

తరలివస్తున్న ప్రముఖ క్రీడాకారులు

జూనియర్‌, యూత్‌ విభాగం– ఇస్తాంబుల్‌లో జరగబోయే ప్రపంచ యూత్‌ ఛాంపియన్‌షిప్‌లకు ముందు భారత యువ క్రీడాకారులు అభినంద్‌ ప్రధి వాది, ప్రియానుజ్‌ భట్టాచార్య లు అండర్‌ 19 పోటీ ల బరిలోకి దిగుతున్నారు. బాలికల విభాగంలో ఆసి యా యూత్‌ ఛాంపియన్‌ దివ్యాంశి భౌమిక్‌, స్థానిక స్టార్‌ హన్సిని మథన్‌రాజ్‌, అనన్య మురళీధరన్‌ పోటీపడనున్నారు. ఫీడర్‌,సీనియర్‌ విభాగం(పురుషులు)లలో ప్రపంచ 48వ ర్యాంకర్‌ మానవ్‌ థక్కర్‌ భారత సవాలుకు నాయకత్వం వహిస్తున్నారు. స్థానిక స్టార్‌, కామన్వెల్త్‌ విజేత సత్యన్‌ జ్ఞానశేఖరన్‌, హర్మీత్‌ దేశాయ్‌, అంకుర్‌ భట్టాచార్జీ కూడా ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. మహిళల కేటగిరిలో ఆసియా క్రీడల కాంస్య విజేత దియా చితాలే, జాతీయ ఛాంపియన్‌ యశస్విని ఘోర్పడే, సుతీర్థ ముఖర్జీ పోటీ పడుతున్నారు. అలాగే, అంతర్జాతీయ పోటీ దారులు జపా న్‌ స్టార్‌ సాచి ఆవోకి , కొరియాకు చెందిన యాంగ్‌ హా యూన్‌, క్వాన్‌ హ్యూక్‌ల నుంచి భారత క్రీడాకారులకు గట్టి సవాలు ఎదురుకానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement