ఓటీటీలో అజిత్‌ ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ | - | Sakshi
Sakshi News home page

ఓటీటీలో అజిత్‌ ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’

Oct 23 2026 1:57 AM | Updated on Oct 23 2026 1:57 AM

తమిళసినిమా: నటుడు అజిత్‌ నటించిన గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ చిత్రం విడుదలై ఏడాది దాటింది. ఆ తరువాత ఆయన ఇప్పటి వరకు మరో చిత్రంలో నటించలేదు. అందుకు కారణం అజిత్‌ అంతర్జాతీయ కారు రేసులపై దష్టి సారించిడమే. దుబాయ్‌ మొదలగు పలు దేశాల్లో జరిగిన అంతర్జాతీయ కారు రేసులో పాల్గొని పతకాలు గెలుచుకున్నారు. దీంతో అజిత్‌ నటించే కొత్త చిత్రం కోసం ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ చిత్రం ఫేమ్‌ ఆధిక్‌ రవిచంద్రన్‌ అజిత్‌ తదుపరి చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు చాలా రోజుల క్రితమే ప్రకటన వెలువడింది. కాగా ఇటీవల ఈ చిత్రాన్ని అజిత్‌ సతీమణి, నటి శాలిని నిర్మించబోతున్నారు అధికారికంగా తెలిపారు. ఆమె బ్రేవ్‌ హార్ట్స్‌ ప్రొడక్షన్స్‌ పేరుతో నిర్మాణ సంస్థను కూడా ప్రారంభించారు. పక్కా కమర్షియల్‌ కథా చిత్రంగా ఇది ఉంటుందని యూనిట్‌ వర్గాలు పేర్కొన్నారు. డేర్‌ డెవిల్‌ అనే టైటిల్‌ను కూడా ఖరారు చేశారు. అయితే ఈ చిత్రం ఇప్పటికి వరకు సెట్‌ పైకి వెళ్లలేదు. కాగా అజిత్‌ అంతర్జాతీయ కారు రేసు దృశ్యాలతో ఒక డాక్యుమెంటరీ చిత్రాన్ని దర్శకుడు ఏఎల్‌. విజయ్‌ నేతృత్వంలో రూపొందించారు. దీన్ని థియేటర్లలో విడుదల చేస్తొమని ప్రకటించారు. ఈ డాక్యుమెంట్‌ చిత్రం కోసం అజిత్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అజిత్‌ నటించిన గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ చిత్రం విజయదశమి సందర్భంగా సోనీ విళా ఓటీటీ విడుదలై ఆయన అభిమానులను ఖుషీ పరుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement