రూ. 5 లక్షల లంచం
తీసుకున్న అధికారి అరెస్టు
కొరుక్కుపేట : చైన్నెలోని తిరువికా నగర్‌కు చెందిన శశికమార్. కొన్ని రోజుల క్రితం, అతను అవినీతి నిరోధక పోలీసులకు ఒక ఫిర్యాదు చేశాడు. అందులో విద్యుత్ వినియోగాన్ని 5 కిలోవాట్ల నుండి 49 కిలోవాట్లకు పెంచడానికి తాను చైన్నెలోని గిండిలో ఉన్న తమిళనాడు విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎన్ ఈడీ) కార్యాలయానికి దరఖా స్తు చేసుకున్నానని పేర్కొన్నాడు. అక్కడి అసిస్టెంట్ ఇంజనీర్ సత్యమూర్తి, తనను రూ. 5 లక్షల లంచం అడిగాడని, ఆ మొత్తం చెల్లించడానికి తన కు ఆసక్తి లేదని తెలిపాడు. దీంతో రూ. 5 లక్షల లంచం డిమాండ్ చేసిన విద్యుత్ బోర్డు అధికారిని పట్టుకోవడానికి అవినీతి నిరోధక, ప్రత్యక్ష సాక్షుల శాఖ పోలీసులు చర్యలు చేపట్టారు. వారి ఆదేశాల మేరకు శశికుమార్ రూ. 5 లక్షలు లంచం ఇస్తుండగా విద్యుత్ బోర్డు ఫోర్‌మాన్ జాన్ డి. బ్రిటోను అవినీతి నిరోధక శాఖ పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా అరెస్టు చేశారు.
సహాయకాల పంపిణీ
వేలూరు: నిరుపేద చర్చి ఫాస్టర్‌లను ఆదుకునేందుకు క్రైస్తవులు ముందుకు రావాలని యూనివర్శిల్ చోజన్ క్రిస్టియన్స్ చర్చి మిషన్ వ్యవస్థాపకులు సరోజాదేవి అన్నారు. వేలూరు జిల్లా కాట్పాడి సమీపంలోని విరుదంబట్టు బాలునగర్‌లో ఉన్న యేసువే బదిల్ చర్చి ఆవరణంలో యూనివర్శల్ చోజన్ క్రిస్టియన్స్ చర్చి మిషన్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. అనంతరం చైర్మన్ జీవా అర్పుదం అద్యక్షతన చర్చి ఫాస్టర్‌లు డాక్టర్ జాయ్ ప్రసన్న, డాక్టర్ బెంజిమేన్ ప్రభాకరన్ నిరుపేదల కుటుంబ సభ్యులకు నిత్యావసర వస్తువులతో పాటు సంక్షేమ పథకాలను అందజేసి మధ్యాహ్నం అన్నదానం చేశారు.
బిహార్ నుంచి
వచ్చిన మొదటి రోజే...
– యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య
అన్నానగర్: బిహార్‌కు చెందిన అమర్‌జిత్ (20) బిహార్ నుండి రైలులో చైన్నెకి బుధవారం ఉదయం వచ్చాడు. ఆ తర్వాత అమర్‌జిత్ కొడుంగైయూర్ లోని రిజ్వాన్ రోడ్డులో ఉన్న తన అన్నయ్య ఇంటికి వెళ్లాడు. అనంతరం బుధవారం రాత్రి ఇంట్లో అమర్‌జిత్ తన అన్నయ్య భాసిత్‌తో మాట్లాడాడు. తర్వాత విశ్రాంతి తీసుకుంటానని తన అన్న గదికి వెళ్లాడు. చాలాసేపటికి, తిరిగి రాకపోవడంతో అన్న భాసిత్ వెళ్లి చూసినప్పుడు, అమర్‌జిత్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉండటం చూసి దిగ్భ్రాంతి చెందాడు. సమాచా రం అందుకున్న వెంటనే, కొడుంగైయూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అమర్‌జిత్ మతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్ట్‌మార్టం కోసం స్టాన్లీ ప్రభుత్వ వైద్య కళాశాలకు పంపించారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి, బిహార్ నుంచి తిరిగి వచ్చిన మొదటి రోజే ఆ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలపై తీవ్ర దర్యాప్తు చేస్తున్నారు.
ప్రభుత్వ బస్సు ఢీకొని
ఇద్దరి మృతి చెందిన కేసులో..
– డ్రైవర్‌కు నాలుగున్నరేళ్ల జైలు
తిరువొత్తియూరు: బస్సు ఢీకొని ఇద్దరు మృతి చెందిన కేసులో డ్రైవర్‌కు 4 సంవత్సరాల 6 నెల లు జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. చైన్నె, ఐనావరం కొన్నూర్ హైరోడ్, సోమసుందరం కూడలిలో గత 2017వ సంవత్సరంలో ప్రభుత్వ బస్సు మోటార్ సైకిల్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మోటార్ సైకిల్‌పై వెళ్తున్న మణికంఠన్, తమిళరసన్ అనే ఇద్దరూ అదే చోట ప్రాణాలు కోల్పోయారు. దీనిపై కీల్పాకం ట్రాఫిక్ పోలీ సులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ కేసులో బుధవారం తీర్పు వెలువడింది. ప్రభుత్వ బస్సు డ్రైవర్ అయిన మణికి 4 సంవత్సరాల 6 నెలలు జైలు శిక్ష, రూ 11 వేల జైలు జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. ఒకవేళ జరిమానా చెల్లించకపోతే అదనంగా 6 నెలల జైలు శిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు.
రోడ్డుపై కూలిన చింతచెట్టు
తిరుత్తణి: వర్షంకు కనకమ్మసత్రం ప్రాంతంలో చింతచెట్టు కూలడంతో పెను ప్రమాదం తప్పింది. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో నాలుగు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈక్రమంలో తిరువలంగాడు కనకమ్మసత్రం రాష్ట్ర రహదారి మార్గంలో ముత్తుకొండాపురం వద్ద భారీ చింతచెట్టు అడుగుభాగం వర్షంకు రోడ్డులో నేలకొరిగింది. గురువారం ఉదయం రోడ్డుపై చెట్టు నేలకొరిగింది. ఆ సమయంలో అటువైపు వాహన చోదుకులు వెళ్లకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వెంటనే తిరుత్తణి అగ్నిమాపక శాఖ సిబ్బది ఘటనా స్థలానికి చేరుకుని రోడ్డులో కూలిన చెట్టును జేసీబీ సాయంతో తొలగించారు. దీంతో గంట తరువాత వాహన సేవలు యధావిధిగా నడిచాయి.


