తిరువళ్లూరు: భారీ వర్షాలు, అగ్నిప్రమాద సమయంలో ప్రజలను కాపాడడంతో పాటూ అప్రమత్తంగా వ్యవహరించే అంశంపై అవగాహన కార్యక్రమాన్ని తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాలలో నిర్వహించారు. ఈ అవగాహన కార్యక్రమానికి డీఎఫ్ఓ లోకనాథన్ అధ్యక్షత వహించగా, దాదాపు 50 మందికి పైగా సిబ్బంది మాక్‌డ్రిల్‌ను నిర్వహించారు. వైద్యశాలలో అగ్నిప్రమాదం సంభవిస్తే ఎలా స్పందించాలి, బాధితులను ఎలా రక్షించాలి, రక్షించిన తరువాత ప్రథమ చికిత్సను ఎలా అందించాలన్న అంశంపై వారికి అవగాహన కల్పించారు. వీటితో పైఅంతస్తులో చిక్కుకున్న వారిని తాడుతో కిందకు దింపడం, మందులు ఇంజెక్షన్ల సదుపాయాలను తెలియజేశారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ప్రజలు తమ వంతు సహాకారాన్ని అందించాలని డీఎఫ్ఓ కోరారు. ప్రభుత్వ వైద్యశాల డీన్ బాలాజీ, ఎమర్జెన్సీ విభాగం డీన్ డాక్టర్ దామోధరన్, వైద్యులు డాక్టర్ విజయరాజ్, డాక్టర్ ప్రభుశంకర్, జగదీష్, రాజ్‌కుమార్, దినేష్ పాల్గొన్నారు.


