జిల్లాలకు ప్రధాన సెషన్స్‌ జడ్జిల నియామకం | - | Sakshi
Sakshi News home page

జిల్లాలకు ప్రధాన సెషన్స్‌ జడ్జిల నియామకం

Oct 19 2026 4:01 AM | Updated on Oct 19 2026 4:01 AM

సాక్షి, చైన్నె: మద్రాస్‌ హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ దీప్తి అరివునిధి ఉత్తర్వుల మేరకు రాష్ట్రంలోని పలు కీలక జిల్లాలకు ప్రధాన సెషన్స్‌ జడ్జిలను నియమిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు చైన్నె మెట్రోపాలిటన్‌ కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన పి. కార్తికేయన్‌ ఇటీవల మద్రాస్‌ హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఈ ఖాళీ స్థానంలో కోయంబత్తూరు ఆర్థిక మోసాల కేసుల ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎం.ఎన్‌. సెంథిల్‌కుమార్‌ చైన్నె మెట్రోపాలిటన్‌ కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. కాంచీపురంలో మోటారు వాహన ప్రమాద కేసులను విచారిస్తున్న జిల్లా న్యాయమూర్తి వి. పాండియరాజ్‌ పెరంబలూరు జిల్లా ప్రధాన సెషన్స్‌ న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు.పూందమల్లి 3వ అదనపు సెషన్స్‌ జిల్లా న్యాయమూర్తి సి. విజయకుమార్‌ రామనాథపురం జిల్లా ప్రధాన సెషన్స్‌ న్యాయమూర్తిగా నియమితులయ్యారు. చెంగల్పట్టు పోక్సో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎం. రాజలక్ష్మి తిరువారూర్‌ జిల్లా సెషన్స్‌ జడ్జిగా బదిలీ కాగా... తిరువారూర్‌లో జిల్లా న్యాయమూర్తిగా పనిచేస్తున్న పి. సెల్వముత్తు కుమారిని చెంగల్పట్టు జిల్లా శాశ్వత లోక్‌ అదాలత్‌ జడ్జిగా నియమితులయ్యారు.

విమర్శలకు స్పందించడం

సమయం వృథా

– పళణి వ్యాఖ్యలపై సెంగోట్టయ్యన్‌

సాక్షి, చైన్నె: తమిళనాడులో ఈశాన్య రుతుపవనాల నేపథ్యంలో ముందస్తు నివారణ చర్యలు జోరుగా సాగుతున్నాయని, సీఎం విజయ్‌ ఆమోదంతో ఏకంగా లక్షా 4 వేల మంది సిబ్బందిని క్షేత్రస్థాయిలో మోహరించినట్లు రాష్ట్ర రెవెన్యూ మంత్రి సెంగోట్టయ్యన్‌ తెలిపారు. కోయంబత్తూరు విమానాశ్రయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వివరాలను వెల్లడించారు. ప్రభుత్వ అధికారులతో పాటు స్వచ్ఛంద సంస్థలు , క్షేత్రస్థాయి సిబ్బంది, సాధారణ ప్రజలు సమన్వయంతో పనిచేసేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. అలాగే వర్షపు నీరు నిలిచిపోయే ప్రమాదమున్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి సహాయక చర్యలు చేపట్టేందుకు 250 ప్రత్యేక పడవలు, మత్స్యకారులను సిద్ధంగా ఉంచామని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి చేస్తున్న విమర్శలను విలేకరులు ప్రస్తావించగా, ప్రజల సంక్షేమం కోసం తాము వేగంగా, బాధ్యతాయుతంగా పనిచేయాల్సిన ఈ తరుణంలో పళనిస్వామి చేసే విమర్శలకు స్పందించి సమయాన్ని వృథా చేయదలచుకోలేదన్నారు. పార్టీలో అందరూ ఐక్యంగా ఉండాలనేది రెండు వర్గాలనూ అడగాల్సిన ప్రశ్న అని, తానను కాదన్నారు. అన్నాడీఎంకే నుంచి పళనిస్వామి తనను తొలగించడం ఒకవిధంగా ఎంతో మేలు చేసిందన్నారు.

సూర్యప్రభ, చంద్రప్రభ

వాహనంపై శ్రీవారి విహారం

కొరుక్కుపేట: చైన్నెలోని టి.నగర్‌లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. అందులో భాగంగా ఆదివారం ఉదయం సూర్యప్రభ, సాయంత్రం చంద్రప్రభ వాహనంపై శ్రీవారి వేంచేపు చేసి విశేష పూజలు నిర్వహించారు. పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులందరికీ ప్రసాద వినియోగం చేశారు. సోమవారం ఉదయం ఆలయంలో రథోత్సవం జరుగుతుందని ఆలయ ఏఈఓ ధనుంజయ తెలిపారు.

11 మంది గ్రూప్‌–1

అధికారులకు ఐఏఎస్‌ హోదా

సాక్షి, చైన్నె : తమిళనాడు ప్రభుత్వంలో సేవలందిస్తున్న 11 మంది గ్రూప్‌–1 అధికారులకు ఐఏఎస్‌ హోదా లభించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. తమిళనాడు రాష్ట్ర సివిల్‌ సర్వీస్‌ విభాగానికి చెందిన 11 మంది అధికారులకు ఇండియన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌(ఐఎఎస్‌) హోదా కల్పిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపినట్లు కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌లో పేర్కొంది. 2024 సంవత్సరానికి గాను ఖాళీలలో కేటాయింపు మేరకు ఐఏఎస్‌లుగా ఎంపికై న అధికారులలో ఆర్‌. ప్రియ, ఎస్‌. ప్రసన్న రామస్వామి, ఎం. ఇందుమతి, ఆర్‌. రాజకృపాకరన్‌, ఎస్‌. సంగీత, కె. ప్రియ. (వీరిలో గవర్నర్‌ భవనంలో పనిచేస్తున్న ప్రసన్న రామస్వామి గ్రూప్‌–1 పరీక్షలో ఉత్తీర్ణుడై డిప్యూటీ కలెక్టర్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించడం విశేషం).ఇక 2025 సంవత్సరానికి కేటాయించిన ఖాళీలలో ఎం. మణిమేఘలై, ఎ. మీనా ప్రియదర్శిని, డి. సెంగోట్టయ్యన్‌, ఎస్‌. శాంతి, ఎన్‌. కాళిదాస్‌ ఉన్నారు. మొత్తంమీద 11 మంది గ్రూప్‌–1 అధికారులు ఐఏఎస్‌ అధికారులుగా పదోన్నతి పొందారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement