కొరుక్కుపేట: చైన్నె పెరియపాలయం సమీపంలోని ఆర్య పాకం శ్రీ విద్యారంభ జ్ఞాన మహా సరస్వతి ఆలయంలో ఈనెల 20వ తేదీ మంగళవారం ఉచిత అక్షరాభ్యాసం (విద్యా ఆరంభం) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఆలయ నిర్వాహకులు పి.వి. కృష్ణారావు తెలిపారు. శరన్నవరాత్రి పండుగ సందర్భంగా శ్రీ విద్యారంభ జ్ఞాన మహా సరస్వతి ఆలయంలో వైభవంగా నవరాత్రి వేడుకలను నిర్వహిస్తున్నారు. ఒక్కో రోజు ఒక్కో అలంకరణలో సరస్వతి అమ్మవారిని విశేషంగా అలంకరించి పూజలు నిర్వహిస్తున్నారు. అలాగే ఆధ్యాత్మిక భక్తి సంగీత నృత్య కార్యక్రమాలు భక్తులను పరవశింప జేస్తున్నాయి. వేడుకల్లో భాగంగా నవ కన్యపూజను వైభవంగా చేపట్టారు. చిన్నారులను దేవతులుగా భావించి పదాలను కుంకుమ పసుపు అద్ది భక్తితో పూజ చేశారు. చిన్నారులకు కానుకలు అందించి వారి ఆశీర్వచనాలు అందుకున్నారు. అనంతరం వీణా వాయిద్య కచ్చేరి భక్తులను పరవశింపజేసింది. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు పి.వి కృష్ణారావు మాట్లాడుతూ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ నెల 20వ తేదీ మంగళవారం ఉదయం ఉచితంగా ఉచిత అక్షరాభ్యాసం కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు.


