పోలీసు పిల్లలకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ | - | Sakshi
Sakshi News home page

పోలీసు పిల్లలకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ

Oct 19 2026 4:01 AM | Updated on Oct 19 2026 4:01 AM

● డీజీపీ మహేష్‌ కుమార్‌ అగర్వాల్‌

సాక్షి, చైన్నె : పోలీస్‌ ఫ్యామిలీ (పోలీస్‌ కుటుంబం) సంక్షేమ పథకం కింద తమిళనాడు వ్యాప్తంగా పోలీసుల పిల్లల కోసం నైపుణ్యాభివృద్ధి శిక్షణా శిబిరాలను నిర్వహించనున్నట్లు డీజీపీ మహేష్‌ కుమార్‌ అగర్వాల్‌ తెలిపారు.పోలీస్‌ సిబ్బంది, వారి కుటుంబాల సంక్షేమమే లక్ష్యంగా డీజీపీ సలహా మేరకు పోలీస్‌ ఫ్యామిలీ పథకాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా ఆవడి పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని పోలీసు సిబ్బంది కుటుంబాల కోసం ఆవడి సత్యమూర్తి నగర్‌ వద్ద నిర్మించిన ప్రత్యేక కిండర్‌ గార్టెన్‌ (చిన్న పిల్లల పాఠశాల) ను పథకం అధ్యక్షురాలు వనితా అగర్వాల్‌ ప్రారంభించారు. అనంతరం పోలీస్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని పరిశీలించిన డీజీపీ మహేష్‌ కుమార్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ కీలక విషయాలను వెల్లడించారు.

నైపుణ్యాభివృద్ధి శిక్షణ

రాష్ట్రవ్యాప్తంగా వైద్య శిబిరాలతో పాటు పోలీసుల పిల్లల్లో ప్రతిభను వెలికితీసేలా నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు.5 ఏళ్లు పైబడిన పోలీసు పిల్లల క్రీడా నైపుణ్యాలు, శారీరక, మానసిక వికాసాన్ని పెంపొందించేందుకు ఆవడిలో అధునాతన ఆట స్థలంతో కూడిన బాలల పార్కును త్వరలోనే ఏర్పాటు చేస్తామని తెలిపారు. పోలీస్‌ స్టేషన్ల అత్యవసర ఖర్చుల నిధిని గతంలో ఉన్న రూ. 3,000 – రూ. 8,000 నుండి ఏకంగా రూ. 30,000 – రూ. 50,000 కు ప్రభుత్వం పెంచిందని వివరించారు. పోలీస్‌ శాఖ చేపట్టే ప్రత్యేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు సైతం చేరవయ్యేలా నిబద్ధతతో పనిచేస్తామని ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఆవడి పోలీస్‌ కమిషనర్‌ సెంథిల్‌ కుమార్‌, ఆయన సతీమణి అరుల్‌ జ్యోతి, జాయింట్‌ కమిషనర్‌ శివకుమార్‌ సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement