నిర్మాణ రంగం కోసం కొత్త ఆవిష్కరణలు | - | Sakshi
Sakshi News home page

నిర్మాణ రంగం కోసం కొత్త ఆవిష్కరణలు

Sep 30 2026 12:22 AM | Updated on Sep 30 2026 12:22 AM

సాక్షి, చైన్నె : సీకే బిర్లా గ్రూప్‌నకు చెందిన నేషనల్‌ ఇంజనీరింగ్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన ఎన్‌బీసీ బేరింగ్స్‌ నిర్మాణ , ఆఫ్‌–హైవే పరికరాల కోసం సరికొత్త బేరింగ్‌ ఉత్పత్తుల శ్రేణిని ఆవిష్కరించింది. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న పారిశ్రామిక రంగాలలో ఒకటైన కన్‌స్ట్రక్షన్‌ ఎక్విప్‌మెంట్‌ రంగంలో తమ ఉనికిని మరింత బలోపేతం చేసుకునే దిశగా బామా కాన్‌ఎక్స్‌పో ఇండియా 2026 వేదికగా ఈ కొత్త ఉత్పత్తులను విడుదల చేశారు. ఇన్‌వొల్యూట్‌ పవర్‌గేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌ అలోక్‌ గోయేల్‌ ఈ కొత్త ఉత్పత్తులు , పరిష్కారాలను ఆవిష్కరించారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న నిర్మాణ , మైనింగ్‌ పరిశ్రమల అవసరాలకు తగినట్లుగా ఈ పోర్ట్‌ఫోలియోను విస్తరించారు.భారీ భారాలను మోయడం, నిరంతరాయంగా పనిచేయడం , కఠినమైన సైట్‌ పరిస్థితులను తట్టుకోవడం వంటి క్లిష్టమైన అవసరాలను తీర్చేలా ఈ కొత్త ఉత్పత్తులను రూపొందించారు. వీటిలో బేరింగ్‌ హౌసింగ్‌ ,ఇండక్షన్‌ హీటర్‌ ,బేరింగ్‌ పుల్లర్‌, ఫిట్టింగ్‌ టూల్స్‌ , సింగిల్‌ పాయింట్‌ ఆటోమేటిక్‌ లూబ్రికేటర్‌ లు ఉన్నాయి. మౌలిక సదుపాయాల అభివృద్ధి, పెరిగిన యాంత్రీకరణ, దేశీయ తయారీపై పెరుగుతున్న దృష్టికి అనుగుణంగా ఈ ఉత్పత్తులను పరిచయం చేశారు. స్థానిక ఇంజనీరింగ్‌ నైపుణ్యం, తయారీ సామర్థ్యం , సాంకేతిక మద్దతుతో తయారీదారులకు నాణ్యమైన ఉత్పత్తులను అందించడమే కంపెనీ లక్ష్యమని నేషనల్‌ ఇంజనీరింగ్‌ ఇండస్ట్రీస్‌ మార్కెటింగ్‌ హెడ్‌ సంజయ్‌ గుప్తా తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement