రూ.50 లక్షలతో డ్రోన్‌ తయారీ, శిక్షణ కేంద్రం | - | Sakshi
Sakshi News home page

రూ.50 లక్షలతో డ్రోన్‌ తయారీ, శిక్షణ కేంద్రం

Sep 30 2026 12:22 AM | Updated on Sep 30 2026 12:22 AM

తిరువళ్లూరు: సెవ్వాపేటలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో రూ. 50 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన డ్రోన్‌ తయారీ, మరమ్మతు కేంద్రాన్ని కలెక్టర్‌ కవిత, ఎమ్మేల్యే కుట్టి ప్రకాశం తదితరులు మంగళవారం ప్రారంభించారు. తిరువళ్లూరు జిల్లా సెవ్వాపేటలోని పాలిటెక్నిక్‌ కళాశాల ఆవరణంలో డ్రోన్‌ తయారీ, మరమ్మతు తదితర వాటిపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రత్యేక శిక్షణ కేంధ్రాన్ని ఏర్పాటు చేశారు. పనులు పూర్తయిన క్రమంలో మంగళవారం ఉన్నత విధ్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి రష్మీ సిద్ధార్థ్‌ జగడే ఉదయం కలెక్టర్‌ కవిత, ఎమ్మేల్యే కుట్టి ప్రకాశం తదితరులు ప్రారంభించారు. అనంతరం ఉన్నత విధ్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి రష్మీ సిద్దార్ద్‌ జగడే మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సేవ్వాపేటలో మానవ రహిత వైమానిక వాహన సంస్థ(టిఎన్‌యూఏవీయూ) ఆధ్వర్యంలో రిమెట్‌ ఫైలట్‌ శిక్షణ సంస్థ(ఆర్‌పిటివో), డ్రోన్‌ నిర్వాహణ, మరమ్మతు, ఓవరాల్‌ కేంద్రాన్ని ప్రారంభించినట్టు తెలిపారు. అబివృద్ది చెందుతున్న సాంకేతికతలను ప్రోత్సహించడానికి తమిళనాడు ప్రభుత్వ చొరవతో మొత్తం 5 కేంధ్రాలను తిరువళ్లూరు, కృష్ణగిరి, మధురై, కారైకుడి, తూత్తుకుడి తదితర ఐదు ప్రాంతాల్లో ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement