చెట్టు కూలి వృద్ధుడి మృతి | - | Sakshi
Sakshi News home page

చెట్టు కూలి వృద్ధుడి మృతి

Sep 30 2026 12:22 AM | Updated on Sep 30 2026 12:22 AM

– కేసు నమోదు చేయకుండా

పోలీసుల కట్ట పంచాయితీ

తిరువొత్తియూరు: చైన్నె రాయపేటలోని ఒక ప్రైవేట్‌ వాణిజ్య సముదాయం నిర్లక్ష్యం కారణంగా ఓ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయిన ఉదంతంలో, చట్టప్రకారం చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు కట్టపంచాయితీ చేయడం కలకలం రేపింది. ప్రాణాలు కోల్పోయిన వృద్ధుడి కుటుంబ పేదరికాన్ని ఆసరాగా చేసుకుని, కేవలం రూ. 30 వేలకు ఈ కేసును ముగించేందుకు పోలీసులు ప్రయత్నించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. వివరాలు.. చైన్నె రాయపేటలో ఒక ప్రముఖ వాణిజ్య సముదాయం ఉంది. ఈ సముదాయం ఆవరణలో వెలుపల నాటిన చెట్లను సక్రమంగా నిర్వహించకుండా నిర్లక్ష్యం చేశారు. ఈ క్రమంలో ఈనెల 24న మధ్యాహ్నం ఆంధ్ర ప్రదేశ్‌, చిత్తూరు జిల్లా కట్టమంచి గ్రామానికి చెందిన రమణప్ప (70) రాయపేటలోని తన బంధువుల ఇంటికి వచ్చారు. ఆయన ఆ రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తుండగా, వాణిజ్య సముదాయంలో ఉన్న ఒక పెద్ద చెట్టు కొమ్మ విరిగి పడి ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, వృద్ధుడిని రాయపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈనెల 27న తేదీన తేదీన ఆయన మృతి చెందారు. కాగా ఈ ప్రమాదానికి కారణమైన వాణిజ్య సముదాయంపై కింద కేసు నమోదు చేయాల్సి ఉంది. కానీ అన్నాసాలై పోలీసులు సదరు వాణిజ్య సముదాయం యాజమాన్యానికి అనుకూలంగా వ్యవహరించి, కేసు నమోదు చేయకుండా బాధితుడి కుటుంబానికి కేవలం రూ 30,000 ఇప్పించి శవాన్ని ఆంధ్రాకు పోలీసులే పంపించి వేసినట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

దేశంలో ఏటా లక్ష మంది పిల్లల అదృశ్యం

– రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి

డాక్టర్‌ పీఎం నాయర్‌

కొరుక్కుపేట: దేశంలో ఏటా లక్షమందికి పైగా పిల్లలు అదృశ్యమవుతున్నారని రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి, అంతర్జాతీయ నిపుణులు డాక్టర్‌ పీఎం నాయర్‌ తెలిపారు. ఇండియన్‌ కమ్యూనిటీ వెల్ఫేర్‌ ఆర్గనైజేషన్‌ (ఐసీడబ్ల్యూవో) జస్ట్‌ రైట్స్‌ ఫర్‌ చిల్డ్రెన్‌(జేఆర్‌సీ), షెవాలియర్‌ టి థామస్‌ ఎలిజిబెత్‌ కాలేజ్‌ ఫర్‌ ఉమెన్‌ (సీటీటీఈ) సంయుక్త ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌ వేధింపులు, లైంగిక దోపిడీ, మానవ అక్రమ రవాణాపై అవగాహన కార్యక్రమం మంగళవారం జరిగింది. చైన్నె పెరంబూరులోని సీటీటీఈ కళాశాల ఆడిటోరియం వేదికగా ఏర్పాటైన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథి, వక్తగా డాక్టర్‌ పిఎం నాయర్‌ పాల్గొని ఆన్‌లైన్‌ వేధింపులు, లైంగిక దోపిడీ, మానవ అక్రమ రవాణా వంటి పెరుగుతున్న ప్రమాదాలపై అవగా హన కల్పించి, అటువంటి ప్రమాదాలను గుర్తించి నివారించేలా మాట్లాడారు. టెక్నాలజీని ఉపయోగించి ఆన్‌లైన్‌లోనూ మోసాలు పెరుగుతున్నారని, వీటిపై యువత అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏటా దేశ వ్యాప్తంగా లక్షమందికిపైగా పిల్లలు అదృశ్యం అవుతున్నారని తెలిపారు. స్వేచ్ఛతోపాటూ అవగాహన, ప్రమాదాలు, దోపి డీ నుంచి తమను తాము రక్షించుకునే సామర్థ్యం కూడా ఉండాలని ఆయన సూచించారు. స్వాగతోపన్యాసంను సీటీటీఈ మహిళా కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఎస్‌ దేవి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement