ఆరోగ్య సంరక్షణ పరిశోధనలో అపోలో నాలెడ్జ్‌ | - | Sakshi
Sakshi News home page

ఆరోగ్య సంరక్షణ పరిశోధనలో అపోలో నాలెడ్జ్‌

Sep 30 2026 12:22 AM | Updated on Sep 30 2026 12:22 AM

సాక్షి, చైన్నె : ఆరోగ్య సంరక్షణ రంగంలో పరిశోధనలు, విద్య , మానవ వనరుల అభివృద్ధిని ప్రోత్సహించే లక్ష్యంతో అపోలో నాలెడ్జ్‌, బిర్లా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌, పిలానీ (బిట్స్‌ పిలానీ) సంస్థలు చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకున్నాయి. అపోలో హాస్పిటల్స్‌ గ్రూప్‌ వ్యవస్థాపక–ఛైర్మన్‌ డాక్టర్‌ ప్రతాప్‌ సి. రెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ఛైర్‌పర్సన్‌ డాక్టర్‌ ప్రీతా రెడ్డి, బిట్స్‌ పిలానీ గ్రూప్‌ వైస్‌–ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ వి. రామగోపాల్‌ రావుల సమక్షంలో ఈ అవగాహన ఒప్పందం మంగళవారం కుదిరింది. అపోలో ఆసుపత్రుల వైద్య వాతావరణాన్ని, బిట్స్‌ పిలానీకి ఇంజనీరింగ్‌, టెక్నాలజీ , డేటా సైన్స్‌లో ఉన్న నైపుణ్యాన్ని అనుసంధానించి.. వైద్యులు, పరిశోధకులు కలిసి సంయుక్తంగా ఆరోగ్య సంరక్షణ సమస్యలపై పరిశోధనలు చేపడతారు. ఈ సహకారం ద్వారా వైద్య రంగంలో సాంకేతికతను, మానవ సంబంధాలను సమన్వయం చేస్తూ భవిష్యత్తుకు సరిపడే నిపుణులైన ఆరోగ్య సంరక్షణ కార్యబలాన్ని తయారు చేయవచ్చని డాక్టర్‌ ప్రీతా రెడ్డి , ప్రొఫెసర్‌ వి. రామ్‌గోపాల్‌ రావు ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement