తాయ్‌ మామన్‌ తంగ మొదిరం(మేన మామ బంగారు ఉంగరం) పథకం సోమవారం అమల్లోకి వచ్చింది. మత సామరస్యాన్ని చాటే దిశగా మధురై వేదికగా రాజాజీ ఆస్పత్రిలో పుట్టిన చంటి బిడ్డలకు సీఎం విజయ్‌ ఉంగారాన్ని తొడిగి పథకానికి శ్రీకారం చుట్టారు. చంటిబిడ్డల్ని ఎత్తుకుని ఆనందాన్ని వ్యక | - | Sakshi
Sakshi News home page

తాయ్‌ మామన్‌ తంగ మొదిరం(మేన మామ బంగారు ఉంగరం) పథకం సోమవారం అమల్లోకి వచ్చింది. మత సామరస్యాన్ని చాటే దిశగా మధురై వేదికగా రాజాజీ ఆస్పత్రిలో పుట్టిన చంటి బిడ్డలకు సీఎం విజయ్‌ ఉంగారాన్ని తొడిగి పథకానికి శ్రీకారం చుట్టారు. చంటిబిడ్డల్ని ఎత్తుకుని ఆనందాన్ని వ్యక

Sep 29 2026 1:51 AM | Updated on Sep 29 2026 1:51 AM

మదురై వేదికగా సీఎం విజయ్‌ శ్రీకారం

రాజాజీ ఆస్పత్రిలో పుట్టిన బిడ్డలకు ఒక గ్రాము చొప్పున పంపిణీ

రోడ్‌ షోలో అభిమాన హోరు

ఎండదెబ్బకు సొమ్మసిల్లిన జనం

సాక్షి, చైన్నె: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన వాగ్దానం నెర వేరుస్తూ సీఎం విజయ్‌ ఈబంగారు ఉంగరం పథకంను మదురై ప్రభుత్వ రాజాజీ ఆసుపత్రి నుంచి శ్రీకారం చుట్టేందుకు నిర్ణయించిన సమాచారంతో ఆయన్ను చూసేందుకు ఉదయం నుంచి జనం పోటెత్తారు. మధురైకి విచ్చేసిన సీఎం విజయ్‌ విమానాశ్రయం నుంచి ప్రభుత్వ ఆసుపత్రి వరకు రోడ్డు మార్గంలో ప్రజల ఆహ్వానాన్ని అందుకుంటూ ముందుకు సాగారు. ఈ క్రమంలో మీనాక్షి అమ్మవారి వేషధారణలో ఉన్న ఒక చిన్నారిని ఆయన ఎత్తుకుని ఆప్యాయంగా పలకరించారు సీఎం పర్యటన నేపథ్యంలో రాజాజీ ఆసుపత్రి ప్రాంగణంతో పాటు ఆయన ప్రయాణించిన ప్రధాన రహదారులన్నీ పండుగ వాతావరణంలో ముస్తాబయ్యాయి. విమానాశ్రయం రాజాజీ ఆస్పత్రి, మీనాక్షి అమ్మన్‌ ఆలయం – విమానాశ్రయం మధ్య 18 కి.మీ దూరంచొప్పున రోడ్‌ షోలో జనం విజయ్‌కు బ్రహ్మరథం పట్టారు..అదే సమయంలో సీఎం విజయ్‌ను చూసేందుకు వేచి ఉన్న అనేక మంది ఎండ దెబ్బకు సొమ్మసిల్లి పోవడంతో ఆస్పత్రికి తరలించారు. వీరికి ప్రథమ చికిత్స అందించారు.

భావోద్వేగ క్షణాలు

రాజాజీ ఆస్పత్రి వేదికపై హిందూ, ముస్లిం, క్రైస్తవ మతాలకు చెందిన ముగ్గురు తల్లుల చేతుల్లోని శిశువులకు సీఎం విజయ్‌ స్వయంగా ఉంగరాలు తొడిగి మత సామరస్యాన్ని చాటే రీతిలో ఈపథకాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. అనంతరం వేదిక కింద ఉన్న తల్లుల వద్దకు వెళ్లి ప్రతి ఒక్కరి బిడ్డకు ఉంగరాలు బహూకరించారు. ఈ సందర్భంగా పలువురు తల్లిదండ్రులు తమ పిల్లలకు నామకరణం చేయాల్సిందిగా సీఎంను కోరారు. వారి కోరిక మేరకు ఆయన పిల్లలను ఎత్తుకుని పేర్లు పెట్టారు. తన బిడ్డకు సీఎం స్వయంగా పేరు పెట్టడం చూసి మహిళలు అనేక మంది భావోద్వేగానికి గురై కంటతడి పెట్టగా, విజయ్‌ వారిని ఆప్యాయంగా ఓదార్చారు. మత సామరస్యానికి ప్రతీకగా మదురైలో ఈ పథకం ప్రారంభం తదుపరి అన్ని జిల్లాలు,నగరాలు, రూరల్‌ ప్రాంతాలలోని ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాలలో జన్మించిన పిల్లలకు మంత్రులు, ఎమ్మెల్యేలు ఉంగారాలు తొడిగారు. రాజాజీ ఆస్పత్రి వేదికపై 27 మందికి శిశువులకు ఉంగారు తొడిగినానంతరం ఆసుపత్రి ప్రసూతి వార్డును సందర్శించిన సీఎం విజయ్‌, అక్కడ చికిత్స పొందుతున్న మరో 10 మంది శిశువులందరికీ ఆసుపత్రి యాజమాన్యం తరఫున బంగారు ఉంగరాలను అందజేయనున్నట్లు ప్రకటించారు.

మీనాక్షి అమ్మవారి సేవలో..

మధ్యాహ్నం కాసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం సీఎం విజయ్‌ మీనాక్షి, సుందరేశ్వరులను సాయంత్రం 4 గంటలకు దర్శించుకున్నారు. మీనాక్షి అమ్మన్‌ ఆలయం వద్దకు ఆయన రాగానే చూసేందుకు పెద్ద ఎత్తున జనం ఎగబడ్డారు. అందర్నీ పలకరిస్తూ అభివాదం చేస్తూ ఆలయం వద్దకు చేరుకున్న సీఎంవిజయ్‌కు పూర్ణ కుంభ స్వాగతం లభించింది. ఆలయంలో స్వామి, అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఓపెన్‌ టాప్‌ వాహనంలో ఆలయం వద్ద నుంచి వీధులలో రోడ్‌ షోగా ముందుకు సాగారు. విజయ్‌ను చూసేందుకు పెద్ద ఎత్తున జనం తరలి రావడం విశేషం. ఈ కార్యక్రమంలో నీటి పారుదల శాఖ మంత్రి ఆనంద్‌, దేవాదాయ శాఖమంత్రి రమేష్‌, ఆరోగ్య శాఖ మంత్రి అరుణ్‌రాజ్‌, న్యాయశాఖ మంత్రి నిర్మల్‌ కుమార్‌, ఉన్నత విద్యాశాఖ మంత్రి విశ్వనాథ్‌, జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌ కృష్ణ , స్థానిక ఎమ్మెల్యేలు కార్తికేయన్‌, కల్లనై, కరుప్పయ్య తదితరులు హాజరయ్యారు.

గాంధీ మ్యూజియంను ప్రారంభిస్తూ..

పునరుద్ధరించిన గాంధీ మ్యూజియం

మదురైలో రూ. 10.25 కోట్ల వ్యయంతో అత్యంత ఆధునిక హంగులతో పునరుద్ధరించిన గాంధీ మెమోరియల్‌ మ్యూజియంను ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవం అనంతరం ఆయన మ్యూజియం లోపలికి వెళ్లి, జాతిపిత మహాత్మా గాంధీ ఉపయోగించిన చారిత్రక వస్తువులను పరిశీలించారు. మహాత్మా గాంధీ మరణానంతరం ఆయన త్యాగాన్ని, స్మృతిని చిరస్థాయిగా నిలపడానికి దేశంలోనే మొట్టమొదటి గాంధీ స్మారక మ్యూజియంను మదురైలోని తముక్కం ప్రాంతంలో ఏర్పాటు చేశారు. మధురై ప్రభుత్వ రాజాజీ ఆసుపత్రి నుంచి సీఎం విజయ్‌ మధ్యాహ్నం 1:10 గంటలకు ఈ పునరుద్ధరించిన గాంధీ మెమోరియల్‌ మ్యూజియంకు విచ్చేశారు. మ్యూజియంను లాంఛనంగా ప్రారంభించి, లోపల ప్రదర్శనకు ఉంచిన గాంధీజీ వస్తువులను తిలకించడంతో పాటు మదురై అండ్‌ గాంధీ ప్రత్యేక డాక్యుమెంటరీని వీక్షించారు.

మధురై పై ప్రత్యేక శ్రద్ద

ఈ కార్యక్రమంలో ఆరోగ్య మంత్రి అరుణ్‌ రాజ్‌ మాట్లాడుతూ, మదురై మీనాక్షి అమ్మవారి చిత్తిరై ఉత్సవాలలో సోదరి కోసం అన్న తన ఆప్యాయతను చాటే ఈ పవిత్ర గడ్డలో తాయ్‌ మామన్‌ తంగ మొదిరం పథకం ప్రారంభించడం ఎంతైనా సముచితం అని వ్యాఖ్యలు చేశారు. మొదటి దశలో భాగంగా 1,28,499 ఉంగరాలను సిద్ధం చేయగా, ఈ ప్రాజెక్ట్‌ కోసం మొత్తం 4,41,667 ఉంగరాలను కొనుగోలు చేయడానికి ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. తమిళనాడులో ప్రతి సంవత్సరం దాదాపు 7.8 లక్షల ప్రసవాలు జరుగుతుండగా, అందులో 4.2 లక్షలు (సుమారు 53 శాతం) ప్రభుత్వ ఆసుపత్రులలోనే జరుగుతున్నాయి. కేవలం ఒక బంగారు ఉంగరం ఆశ చూపించి ప్రజలను ప్రభుత్వ ఆసుపత్రులకు రప్పించడం తమ ప్రభుత్వ ఉద్దేశం కాదని, ప్రజలకు అత్యుత్తమ నాణ్యమైన వైద్య సేవలు అందించి, ప్రభుత్వ ఆసుపత్రులను వారికి మరింత చేరువ చేయడమే ముఖ్య లక్ష్యం అని ఆయన స్పష్టం చేశారు. న్యాయ శాఖ మంత్రి నిర్మల్‌ కుమార్‌ మాట్లాడుతూ, మధురై ప్రజల పై ఉన్న ప్రత్యేక శ్రద్దతో ఇక్కడ ఈపథకం అమలుకు సీఎం విజయ్‌ నిర్ణయించారన్నారు.

అమల్లోకి మేనమామ బంగారు ఉంగరం పథకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement