పారిశ్రామికవేత్తలుగా మహిళలు | - | Sakshi
Sakshi News home page

పారిశ్రామికవేత్తలుగా మహిళలు

Sep 29 2026 1:51 AM | Updated on Sep 29 2026 1:51 AM

● రూ. 5 కోట్ల వరకు రుణాలు ● తమిళనాడు ప్రభుత్వం కొత్త పథకం ప్రకటన

● రూ. 5 కోట్ల వరకు రుణాలు ● తమిళనాడు ప్రభుత్వం కొత్త పథకం ప్రకటన

సాక్షి, చైన్నె : తమిళనాడులో మహిళా సాధికారతను ప్రోత్సహించేందుకు, కొత్త పరిశ్రమల ఏర్పాటును వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ఒక కీలక పథకానికి శ్రీకారం చుట్టింది. మహిళలు కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి, అలాగే ఉన్న వ్యాపారాలను విస్తరించుకోవడానికి వీలుగా రూ. 10 లక్షల నుండి రూ. 5 కోట్ల వరకు భారీ రుణ సహాయం అందించనున్నట్లు ప్రకటించింది.

పథకం ముఖ్యాంశాలు..

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 234 శాసనసభ నియోజకవర్గాల నుండి ప్రతి నియోజకవర్గానికి 10 మంది చొప్పున మొత్తం 2,340 మంది మహిళా పారిశ్రామికవేత్తలకు రుణ సహాయం అందించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యంగా నిర్ణయించారు. అర్హత కలిగిన మహిళలకు రూ. 10 లక్షల నుంచి రూ. 5 కోట్ల వరకు (కొన్ని విభాగాల్లో రూ. 6 కోట్ల వరకు) రుణాలు మంజూరు చేస్తారు. ఈ రుణాలపై వార్షిక వడ్డీ రేటును 9.95 శాతంగా నిర్ణయించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఆసక్తి, అర్హత కలిగిన 10 మంది మహిళలను గుర్తించి వాణిజ్య , పరిశ్రమల మండలికి నివేదిస్తారు. పరిశ్రమల శాఖ అందిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, నిర్దేశిత షరతుల ఆధారంగా లబ్ధిదారులను ఆమోదిస్తుంది. బ్యాంకులతో పాటు కార్పొరేట్‌ రుణ సదుపాయాలు సులభంగా లభించేలా ప్రభుత్వం తగిన మార్గదర్శకత్వం, మద్దతు అందిస్తుంది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో మహిళా ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతాయని, ఇది తమిళనాడు ఆర్థిక పురోగతికి మరింత ఊతాన్నిస్తుందని ప్రభుత్వం వెల్లడించింది.

సేవా పన్నును ఉపసంహరించుకోకుంటే నిరసన

– ఎ.ఎం. విక్రమరాజా

కొరుక్కుపేట: చెంగల్పట్టు జిల్లాలోని సింహపెరుమాళ్‌కోయిల్‌ సమీపంలో తమిళనాడు వర్తకుల సంఘాల సమాఖ్య తరఫున కొత్త సంఘాలను ప్రారంభించే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి తమిళనాడు వర్తకుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఎ.ఎం. విక్రమరాజ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఆయన కొత్త సంఘాలను ప్రారంభించి, ప్రత్యేక ప్రసంగం చేశారు. అనంతరం, ఎ.ఎం. విక్రమరాజ మాట్లాడుతూ...యూపీఐ డబ్బు బదిలీలపై విధించిన 0.4శాతం సేవా పన్నును కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలి. ఒకవేళ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సేవా పన్నును ఉపసంహరించుకోవడానికి తగిన చర్యలు తీసుకోకపోతే, అన్ని కార్మిక సంఘాలు చేపట్టనున్న నిరసనల తదుపరి దశకు సంబంధించి రేపు (29వ తేదీ) తిరువన్నామలైలో జరగనున్న సమావేశంలో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటామని హెచ్చరించారు. ప్రస్తుతం, బియ్యం, కూరగాయల కూరలతో సహా వివిధ ఉత్పత్తులు, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. వీటిని నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

తిరుపత్తూరు

టీవీకే ఎమ్మెల్యేకు ఊరట

– పెరియకరుప్పన్‌కు షాక్‌

– ఎన్నికల కేసు కొట్టివేత

సాక్షి, చైన్నె: తిరుపత్తూరు నియోజకవర్గంలో టీవీకే ఎమ్మెల్యే శ్రీనివాస సేతుపతి కేవలం ఒక్క ఓటు తేడాతో గెలుపొందడాన్ని సవాలు చేస్తూ డీఎంకే మాజీ మంత్రి పెరియకరుప్పన్‌ దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు కొట్టివేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో శివగంగ జిల్లాలోని తిరుపత్తూరు నియోజకవర్గం నుంచి టీవీకే తరఫున పోటీ చేసిన శ్రీనివాస సేతుపతి అత్యంత ఉత్కంఠభరిత పోరులో ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు. శ్రీనివాస సేతుపతి 83,375 ఓట్లు, డీఎంకే అభ్యర్థి, మాజీ మంత్రి పెరియకరుప్పన్‌ 83,374 ఓట్లు సాధించారు. ఈ విజయాన్ని సవాలు చేస్తూ పెరియకరుప్పన్‌ మద్రాసు హైకోర్టులో ఎన్నికల పిటిషన్‌ దాఖలు చేశారు. శివగంగ జిల్లాలోని తిరుపత్తూరు నియోజకవర్గానికి చెందిన పోస్టల్‌ ఓటును పొరపాటున మరో ప్రాంతానికి పంపడం వల్లనే తాను ఓడిపోవాల్సి వచ్చిందని ఆయన ఆరోపించారు.

న్యాయస్థానంలో వాదనలు

ఈ కేసు విచారణ సందర్భంగాటీవీకే ఎమ్మెల్యే శ్రీనివాస సేతుపతి తరఫున వాదనలు వినిపిస్తూ... నియోజకవర్గాలను కేవలం సంఖ్యల ఆధారంగానే గుర్తిస్తారని, పోస్టల్‌ ఓట్ల కవర్లపై నియోజకవర్గం సంఖ్య, పేరు, జిల్లా అన్నీ స్పష్టంగా ముద్రించబడి ఉంటాయని తెలిపారు. పోస్టల్‌ ఓటు తప్పుగా మళ్లిందనడానికి ఎలాంటి బలమైన ఆధారాలు లేవని వాదించారు. మరోవైపు, ఎమ్మెల్యే దాఖలు చేసిన డిస్మిస్‌ పిటిషన్‌ను తోసిపుచ్చాలని డీఎంకే అభ్యర్థి పెరియకరుప్పన్‌ కోరారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి జస్టిస్‌ జి.కె. ఇలంధిరియన్‌ శ్రీనివాస సేతుపతి విజయాన్ని సవాలు చేస్తూ డీఎంకే అభ్యర్థి పెరియకరుప్పన్‌ దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్‌ను కొట్టివేస్తూ తుది తీర్పు వెలువరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement