రూ.100 కోట్ల లంచం ఆరోపణల కేసు | - | Sakshi
Sakshi News home page

రూ.100 కోట్ల లంచం ఆరోపణల కేసు

Sep 29 2026 1:51 AM | Updated on Sep 29 2026 1:51 AM

● కోర్టుకు మాజీ మంత్రి అన్బిల్‌ మహేష్‌ ● పిటిషన్‌ను విచారించనున్న హైకోర్టు

సాక్షి, చైన్నె: ప్రైవేట్‌ పాఠశాలలకు అనుమతులు మంజూరు చేయడానికి రూ. 100 కోట్లకు పైగా వసూలు చేశారంటూ చైన్నె సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు నమోదు చేసిన క్రిమినల్‌ కేసును రద్దు చేయాలని కోరుతూ మాజీ మంత్రి అన్బిల్‌ మహేష్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరిస్తామని మద్రాసు హైకోర్టు వెల్లడించింది. వివరాలు.. డీఎంకే ప్రభుత్వ హయాంలో వెయ్యికి పైగా ప్రైవేట్‌ పాఠశాలలకు శాశ్వత గుర్తింపు, డిటిసిపి , సీఎండీఏ పర్మిట్లు , ఇతర చట్టపరమైన అనుమతులు ఇస్తామని చెప్పి రూ. 100 కోట్లకు పైగా అక్రమంగా వసూలు చేశారంటూ ఒక సంఘం అధ్యక్షుడు డి.సి. ఇలంగోవన్‌ , పలువురు పాఠశాలల నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన చైన్నె సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు జూన్‌ 27న ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఈ కేసులో పాఠశాల విద్యాశాఖ మాజీ మంత్రి అన్బిల్‌ మహేష్‌, ప్రైవేట్‌ పాఠశాలల సంఘం అధ్యక్షుడు పి.డి. అరసకుమార్‌, మాజీ ఎమ్మెల్యే ముత్తుకుమార్‌, సురేష్‌, రాజా తదితరులను నిందితులుగా చేర్చారు. ఇప్పటికే అరసకుమార్‌ను అరెస్టు చేయగా, సెప్టెంబర్‌ 16న అన్బిల్‌ మహేష్‌ నివాసం, కార్యాలయాలు, ఆయన బంధువుల నివాసాలు సహా మొత్తం 9 చోట్ల సోదాలు నిర్వహించి, వందకు పైగా కీలక పత్రాలు, డిజిటల్‌ సాక్ష్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోలీసుల సమన్ల మేరకు సెప్టెంబర్‌ 18న అన్బిల్‌ మహేష్‌ విచారణకు హాజరయ్యారు.

హైకోర్టులో పిటిషన్‌ – విచారణ:

తనపై నమోదైన 4 సెక్షన్ల ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని కోరుతూ అన్బిల్‌ మహేష్‌ మద్రాసు హైకోర్టులో సోమవారం పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ జస్టిస్‌ వి. లక్ష్మీ నారాయణన్‌ ఎదుట విచారణకు వచ్చింది. అన్బిల్‌ మహేష్‌ తరఫున వాదించిన న్యాయవాది రిచర్డ్సన్‌ విల్సన్‌, ఎఫ్‌ఐఆర్‌ కాపీ లేకుండానే పిటిషన్‌ను అత్యవసరంగా విచారణకు జాబితా చేయాలని అభ్యర్థించారు. దీనిని న్యాయమూర్తి అంగీకరిస్తూ... తగిన రిజిస్ట్రీ ప్రక్రియలను పూర్తి చేసి, ఈ పిటిషన్‌ను బుధవారం విచారణకు జాబితా చేయాలని కోర్టు రిజిస్ట్రీని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement