రాహుల్‌ను పీఎం అభ్యర్థిగా.. విజయ్‌ అంగీకరిస్తారు! | - | Sakshi
Sakshi News home page

రాహుల్‌ను పీఎం అభ్యర్థిగా.. విజయ్‌ అంగీకరిస్తారు!

Sep 29 2026 1:51 AM | Updated on Sep 29 2026 1:51 AM

● కాంగ్రెస్‌ ఎంపీ మాణిక్యం ఠాకూర్‌

సాక్షి, చైన్నె: రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్‌ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉంటారని, తమిళగా వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు,సీఎం విజయ్‌ కూడా ఆయన అభ్యర్థిత్వాన్ని అంగీకరిస్తారని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, ఎంపీ మాణిక్యం ఠాకూర్‌ ధీమా వ్యక్తం చేశారు. గతంలో ప్రతిపక్ష ఇండియా కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న డీఎంకే తరఫున ఎం.కే. స్టాలిన్‌, రాహుల్‌ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రతిపాదించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. వివరాలు.. తాజాగా తమిళనాడు రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిన విషయం తెలిసిందే. సీఎం విజయ్‌ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడినానంతరం రాబోయే లోక్‌ సభ ఎన్నికల్లో విజయ్‌ను ప్రధాని అభ్యర్థిగా ప్రచారం చేయాలనే ఆలోచనలు కూడా కొన్ని వర్గాల్లో తీవ్రంగా వ్యక్తం అవుతున్నది. టీవీకే వర్గాలు ఇప్పటికే ఆ నినాదం అందుకున్నారు.అదే సమయంలో ఉత్తరాది రాష్ట్రాల్లో సైతం ఆయనకు సంబంధించి సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. టీవీకే శాఖలు ఉత్తరాదిలోనూ ఏర్పాటు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో విజయ్‌ నేతృత్వంలోని టీవీకే పార్టీ రాహుల్‌ గాంధీని ప్రధాని అభ్యర్థిగా అంగీకరిస్తుందా అనే ప్రశ్నకు మాణిక్యం ఠాకూర్‌ సోమవారం స్పందించారు.

రాహుల్‌ పీఎం అభ్యర్థి

తమకు రాహుల్‌ గాంధీనే ఏకై క నాయకుడని, ఆయన నాయకత్వంలోనే ప్రయాణం కొనసాగుతుందన్నారు. ఎన్నికలు దగ్గరపడే సమయానికి టీవీకే అధినేత విజయ్‌ తన నిర్ణయాన్ని ప్రకటిస్తారని, రాహుల్‌ గాంధీకి విజయ్‌ తప్పకుండా మద్దతు ఇస్తారనే నమ్మకం నూటికి నూరు శాతం ఉందని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో మూడో కూటమి ఏర్పాటు గురించిన చర్చలపై ఆయన స్పందిస్తూ, ‘‘తాత్కాలికంగా ఊపందుకునే కొన్ని రాజకీయ ఉద్యమాలను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. మూడో కూటమి సఫలమయ్యే అవకాశాలు చాలా తక్కువ. గతంలో 2014లో డీఎంకే ఒంటరిగా పోటీ చేసి ఎలాంటి ఫలితాన్ని పొందిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మళ్లీ మూడో కూటమి ప్రయోగాలు చేస్తే అదే పరిస్థితి పునరావృతమవుతుంది’’ అని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement