కర్మయోగికి ఘన నివాళులు | - | Sakshi
Sakshi News home page

కర్మయోగికి ఘన నివాళులు

Jul 16 2026 5:06 AM | Updated on Jul 16 2026 5:06 AM

● ఘనంగా కామరాజర్‌ 124వ జయంతి

సాక్షి,చైన్నె : కర్మయోగి పెరుంతలైవర్‌ కామరాజర్‌ 124వ జయంతిని బుధవారం రాష్ట్రవ్యాప్తంగా వాడ వాడలలో ఘఽనంగా నిర్వహించారు. సీఎం ఎస్‌. జోసెఫ్‌ విజయ్‌ చైన్నె అన్నా సాలైలోని పల్లవన్‌ ఇల్లం ఎదురుగా ఉన్న కామరాజర్‌ విగ్రహం వద్ద అలంకరించి ఉంచిన చిత్రపటానికి పూలమాలలు వేసి, పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా సీఎం విజయ్‌ తన ఎక్స్‌పేజిలో కామరాజర్‌ సేవలను గుర్తు చేసుకున్నారు. నిజాయితీ, త్యాగం, దూరదృష్టి , నిస్వార్థ ప్రజాసేవ వంటి మహోన్నత గుణాలతో భారత రాజకీయాల్లో చెరగని ముద్ర వేయడమే కాకుండా, తన జీవితాన్ని ప్రజల సంక్షేమానికి అంకితం చేసిన పెరుంతలైవర్‌ కామరాజర్‌ అడుగుజాడల్లో పయనిస్తూ సుసంపన్నమైన తమిళనాడును నిర్మించేందుకు అందరం ప్రతిజ్ఞ చేద్దామని పిలుపునిచ్చారు. నివాళులర్పించిన వారిలో సీఎం విజయ్‌ తో పాటుగా స్పీకర్‌ జేసీడీ ప్రభాకర్‌, మంత్రులు ఎన్‌ ఆనంద్‌, ఆదవ్‌ అర్జున,అరుణ్‌ రాజ్‌, సెంగోట్టయన్‌,. పి. వెంకటరమణన్‌ , రాజ్‌ మోహన్‌, ఏ.ఎమ్‌. షాజహాన్‌ , ఎన్‌. మరియా విల్సన్‌ , కుమార్‌, ఎంపీ ప్రవీణ్‌ చక్రవర్తిలు ఉన్నారు.అనంతరం మాజీ మంత్రులు గోకుల ఇందిర, వలర్మతి, జయకుమార్‌ తదితరుల నేతృత్వంలోని అన్నాడీఎంకే వర్గాలు అంజలిఘటించారు. తర్వాత వివిధ రాజకీయ పక్షాలకు చెందిన నాయకులు, సంఘాలకు చెందిన ప్రతినిదులు నివాళులర్పించారు. ఇక, విద్యా సంస్థలలోనూ కామరాజర్‌ జయంతి సందర్భంగా పలు కార్యక్రమాలు జరిగాయి. కాగా, లండన్‌లో ఉన్న మాజీ సీఎం , డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ కామరాజర్‌ ఘనతను స్మరిస్తూ ట్వీట్‌ చేశారు. ఇక, కాంగ్రెస్‌ కార్యాలయాలలో నివాళులు, సేవా కార్యక్రమాలు జరిగాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement