సత్య శోధనపై చర్చించే ‘ప్రామిస్‌’ | - | Sakshi
Sakshi News home page

సత్య శోధనపై చర్చించే ‘ప్రామిస్‌’

Jun 9 2026 5:36 AM | Updated on Jun 9 2026 5:36 AM

తమిళసినిమా: నా జీవితమే ఒక సత్య శోధన. సత్యాన్ని పరిశోధించబడిన విధానాన్ని తెలుసుకోవాలంటే నా సత్య శోధన అనే జీవిత చరిత్రను చదవండి అని మహాత్మా గాంధీ చెప్పారు. ఆయన రాసిన సత్య శోధన జీవిత చరిత్ర చదివిన తరువాత ఆయన జీవితంలో సత్యం, నిజం,సాయం వంటివి విషయాల గురించి తెలుసుకోవచ్చు. గాంధీజీకి మార్గదర్శిగా సత్యహరిచంద్రుడు సత్యం కోసం చేసిన పోరాటం కథ అని చెప్పవచ్చు. ఇలా సత్యం అనేది మన పారంపర్యం, సంస్కృతి సాంప్రదాయాల నుంచి వస్తోంది.అలాంటి సత్యం జీవితంలో ఆడే ఆటను తెరపై ఆవిష్కరించే కథా చిత్రం ప్రామిస్‌ అని.. దర్శక, కథానాయకుడు అరుణ్‌ కుమార్‌ శేకర్‌ చెప్పారు. నటి నదియా సోము నాయకుడిగా నటించిన ఇందులో సుజన్‌, అమ్రీష్‌, ప్రతాప్‌, గోకుల్‌, సుందరవేల్‌,రాజ్‌ కుమార్‌,కలైవాణి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఎన్‌.నాగరాజ్‌ సమర్పణలో సంఘమిత్రన్‌ ప్రొడక్షన్స్‌,అమ్మన్‌ ఆర్ట్స్‌ క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక సందర్భంలో సత్య శోధన పరిస్థితులను ఎదుర్కొంటాడు. అలా ఈ చిత్రంలో కథానాయకుడు ఎదుర్కొనే సత్య శోధన సంఘటనలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా రూపొందించిన చిత్రం ప్రామిస్‌. ఇటీవల చిత్రం ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ దర్శకుడు చేరన్‌ విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది. అదేవిధంగా చిత్ర ట్రైలర్‌ ఏబీ ఇంటర్నేషనల్‌ ఛానల్‌ లో విడుదలై ప్రేక్షకుల ఆదరణను పొందుతోంది. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ప్రామిస్‌ చిత్రాన్ని ఈ నెల 26వ తేదీన యాక్షన్‌ రీ యాక్షన్‌ సంస్థ అధినేత జెనీశ్‌ విడుదల చేస్తున్నారు అని.. దర్శకుడు చెప్పారు. కాగా ఈ చిత్రానికి వినోద్‌ కుమార్‌ ఛాయాగ్రహణం, సర్వాణి దీపన్‌ సంగీతాన్ని అందించారు.

నిత్యా మీనన్‌

ప్రధాన పాత్రలో కొత్త చిత్రం

తమిళసినిమా: దక్షిణాది నటీమణుల్లో నటి నిత్యామీనన్‌ ప్రత్యేకమనే చెప్పాలి. చాలా ముక్కుసూటి మనిషి. మనసులో అనిపించింది చెప్పే భామ. పాత్రల్లో జీవించే నటీమణి. కాస్త బొద్దుగా ఉన్నా, దాన్నే అలంకారంగా భావించే బ్యూటీ. కథా పాత్రలు నచ్చితేనే నటించడానికి అంగీకరించే నటి. విమర్శలను అస్సలు పట్టించుకోని సంచలన నటి. సెలెక్టీవ్‌ చేసే నిత్యామీనన్‌ ఇటీవల తమిళంలో నటించిన తలైవన్‌ తలైవి చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఆ తరువాత మరో చిత్రం కమిట్‌ కానీ ఈమెను తాజాగా ఒక కథ తెగ నచ్చేసిందట. దీంతో ఆ చిత్రంలో నటించడానికి పచ్చజెండా ఊపేసినట్లు తాజా సమాచారం. అవును ఇంతకు ముందు యామిరుక్క భయమే, కాట్టేరి, కవల్‌ వేండామ్‌ వంటి చిత్రాలను తెరకెక్కించిన డీకే తాజాగా తన కొత్త చిత్రానికి సన్నాహాలు చేస్తున్నారు. ఉమెన్‌ సెంట్రిక్‌ కథాంశంతో రూపొందిస్తున్న ఈ చిత్రంలో నటి నిత్యామీనన్‌ ప్రధాన పాత్రను పోషించనున్నారు. ఈమెకు దర్శకుడు కథ చెప్పగానే తెగ నచ్చేసిందనీ దీంతో ఆమె వెంటనే నటించడానికి అంగీకరించినట్లు సమాచారం. విశేషం ఏమిటంటే ఈ చిత్రంలో నటించడానికి చిన్న మొత్తాన్నే అడ్వాన్స్‌గా తీసుకున్నారని, మిగిలింది చిత్రానికి వచ్చే లాభాల్లో షేర్‌ను తీసుకోవడానికి నిత్యామీనన్‌ అంగీకరించినట్లు సమాచారం. చాలాకాలంగా నిర్మాతలు కోరుకుంటోంది ఇదే కావడంతో.. ఈ విషయంలో పలువురికి నిత్య మీనన్‌ మార్గదర్శిగా నిలుస్తారని చెప్పవచ్చు. కాగా ఈమె నటించనున్న తాజా చిత్రానికి సంబంధించి న పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా, వెల్లడించే అయ్యే అవకాశం ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement