క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Jun 9 2026 5:36 AM | Updated on Jun 9 2026 5:36 AM

విరుగంబాక్కంలో గ్రీవెన్స్‌ కార్యాలయం

– ప్రారంభించిన మంత్రి ఎన్‌. ఆనంద్‌

కొరుక్కుపేట: విరుగంబాక్కంలో ఎమ్మెల్యే , శాసనసభ చీఫ్‌ విప్‌ ఆర్‌. శబరినాథన్‌ నేతృత్వంలో ఎమ్మెల్యే కార్యాలయాన్ని ప్రజా ఫిర్యా దుల పరిష్కార కార్యాలయంగా ఆదివారం ఏర్పాటు చేశారు. స్థానిక విరుగం బాక్కం పరిధిలోని సాలిగ్రామంలోని అరుణాచలం రోడ్డులో ఉన్న కొత్తగా పునరుద్ధరించిన కార్యాలయాన్ని ముఖ్య అతిథిగా పాల్గొన్న టి.వి.కె. ప్రధాన కార్యదర్శి, మంత్రి ఎన్‌. ఆనంద్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి ఎన్‌. ఆనంద్‌కు డప్పుల మోతతో ఘన స్వాగతం లభించింది. కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్‌. ఆనంద, అసెంబ్లీ సభ్యుడు, విప్‌ ఆర్‌. శబరినాథన్‌ను అభినందించి, ఆయనను కుర్చీలో కూర్చోబెట్టారు. వేలాది మందికి భోజనం వడ్డించారు. ముఖ్యమంత్రి విజయ్‌ సహాయకుడు, విప్‌ ఆర్‌. శబరినాథన్‌ తండ్రి అయిన రాజేంద్రన్‌ కూడా హాజరయ్యారు.

రేషన్‌ డీలర్ల సమ్మె సైరన్‌

కొరుక్కుపేట: తమ డిమాండ్‌లను నెరవేర్చాలని కోరుతూ రేషన్‌ దుకాణం కార్మికులు సమ్మెను ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వ రేషన్‌ దుకాణం ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రాజేంద్రన్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలేష్‌ కుమార్‌ ఈమేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. రాజకీయ సంఘర్షణలు, సహకార శాఖ ఉన్నతాధికారుల తీవ్రమైన బెదిరింపుల కారణంగా డీలర్లందరూ తీవ్ర ఇబ్బందులు పడుతూ, మనశ్శాంతిని కోల్పోతున్నార ని పేర్కొన్నారు. డీలర్ల సంక్షేమం కోసం 8 సూత్రాల డిమాండ్‌లను జూన్‌ నెలాఖరులోగా డిమాండ్లు నెరవేర్చకపోతే, జూలై 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా విధులను బహిష్కరిస్తామన్నారు. ఉద్యోగుల మనశ్శాంతిని కాపాడేందు కు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ జోక్యం చేసుకుని తగిన ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు.

ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాలల్లో కౌన్సెలింగ్‌ ప్రారంభం

కొరుక్కుపేట: తమిళనాడులోని ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాలల్లో ప్రవేశాల కోసం కౌన్సెలింగ్‌ సోమ వారం ప్రారంభమైంది. ఆయా కళాశాలల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కౌన్సెలింగ్‌ జరుగుతుంది. ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాలల్లో ప్రవేశాల కోసం సుమారు 24 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, వారి స్కోర్‌ల ఆధారంగా వారిని కౌన్సెలింగ్‌కు ఆహ్వానించారు. సోమవారం ప్రతి కళాశాలకు వెయ్యికి పైగా విద్యార్థులు వచ్చారు. చైన్నెలో రాజధాని కాలేజ్‌, వ్యాసర్‌పాడి అంబేడ్కర్‌ కాలేజ్‌, నందనం ఆర్ట్స్‌ కాలేజ్‌, ఆర్‌.కె. నగర్‌ ఆర్ట్స్‌ కాలేజ్‌, క్వీన్‌ మేరీ ఉమెన్స్‌ కాలేజ్‌ సహా పలు ప్రభుత్వ కళాశాలల్లో చేరడానికి విద్యార్థు లు ఉత్సాహంగా వచ్చారు. కళాశాల ప్రిన్సిపాల్‌ల నాయకత్వంలో సహాయ ఆచార్యులు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. 400 మార్కులకు పైగా సాధించిన విద్యార్థులకు తొలి రోజు కౌన్సెలింగ్‌ చేపట్టారు.

రిటైల్‌ రంగంలో విస్తరణలు

సాక్షి, చైన్నె : ప్రముఖ స్ప్రింగ్‌ మ్యాట్రెస్‌, స్లీప్‌ సొల్యూషనన్స్‌ బ్రాండ్‌ పెప్స్‌ ఇండస్ట్రీస్‌, తమిళనాడులో తన రిటైల్‌ నెట్‌వర్క్‌ను మరింత విస్తరించేందుకు చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా మణివాక్కంలో ప్రతిష్టాత్మకమైన 135వ గ్రేట్‌ స్లీప్‌ స్టోర్‌ను ప్రారంభించింది. వేగంగా అభివృద్ధి చెందుతున్న చైన్నె పరిసర ప్రాంతాల వినియోగదారులకు ప్రీమియం, సాంకేతిక ఆధారిత నిద్ర ఉత్పత్తులను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ఈ సరికొత్త ఎక్స్‌పీరియన్షియల్‌ స్టూడియోను అందుబాటులోకి తెచ్చారు. పెప్స్‌ ఇండస్ట్రీస్‌ సేల్స్‌ జనరల్‌ మేనేజర్‌ ఎస్‌. రాజేష్‌, స్థానిక ప్రముఖులు ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. వండలూర్‌ – వాలాజాబాద్‌ మెయిన్‌ రోడ్డులో వినియోగదారులకు సరికొత్త అనుభూతిని ఇచ్చేలా ఈ స్టూడియో డిజైన్‌ చేయబడిందని , ఇక్కడ పెప్స్‌ బ్రాండ్‌కు చెందిన పూర్తి స్థాయి అన్ని ఉత్పత్తులను పరిశీలించ వచ్చు అని . పెప్స్‌ ఇండస్ట్రీస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ జి. శంకర్‌ రామ్‌ తెలిపారు. తమిళనాడు అత్యంత కీలకమైన మార్కెట్‌ అని, ఇందులోనూ చైన్నె నగరం తమ వృద్ధికి ప్రధాన కేంద్రంగా ఉందన్నారు.

అతిగా మద్యం తాగి

యువకుడి మృతి

తిరువొత్తియూరు: దిండివనం సమీపంలోని పెరపేరి మారియమ్మన్‌ కోవిల్‌ వీధికి చెందిన సెల్వం కుమారుడు అజిత్‌ (26) కూలి పనులు చేస్తుంటాడు. అతడికి మద్యపానం అలవాటు ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో, అతను విపరీతంగా మద్యం సేవించి పడిపోయాడు. స్థానికులు దిండివనం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, అతడిని పరీక్షించిన వైద్యులు, అజిత్‌ ఆసుపత్రికి తీసుకువచ్చే దారిలోనే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెల్లిమేడుపేట పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement