యాక్షన్‌ సన్నివేశాల్లో రైసా విల్సన్‌ ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

యాక్షన్‌ సన్నివేశాల్లో రైసా విల్సన్‌ ప్రతిభ

Jun 9 2026 5:36 AM | Updated on Jun 9 2026 5:36 AM

తమిళసినిమా: యాక్షన్‌ సన్నివేశాల్లో హీరోల కంటే హీరోయిన్లు చేస్తే కిక్కే వేరు. అలాంటి యాక్షన్‌ సన్నివేశాల్లో నటి రైసా నెల్సన్‌ అదరగొట్టారట. ప్యార్‌ ప్రేమ కాదల్‌ చిత్రం ఫేమ్‌ నటి రైసా విల్సన్‌ చిన్న గ్యాప్‌ తరువాత నటిస్తున్న చిత్రం నోవా. ఇంతకు ముందు ఆది, హన్సిక జంటగా నటించిన పార్టనర్‌ చిత్రాన్ని నిర్మించిన రాయల్‌ ఫార్చ్యూనా క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తున్న తాజా చిత్రం నోవా. ఫేస్‌ ఒన్‌ –ది అరైవల్‌ అనే ఉపశీర్షికతో కూడిన ఈ చిత్రం ద్వారా మిలో అనే నవ దర్శకుడు పరిచయం అవుతున్నారు.ఈయన ఇంతకు ముందు 20కి పైగా వాణిజ్య ప్రకటనను రూపొందించారు. కథానాయికిగా నటి రైసా విల్సన్‌ నటించిన ఈ చిత్రంలో కర్ణాటకకు చెందిన అద్విక శెట్టి, బెంగాలి నటి కతిక బిశ్వాస్‌, మలయాళ నటుడు జో జాన్‌ సాక్కో,సెండ్రయన్‌, యూట్యూబ్‌ ఫేమ్‌ ఫైనలీ స్వాతిక తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది హారర్‌ సైనన్స్‌ ఫిక్షన్‌ సూపర్‌ నాచురల్‌ ఫ్యాటసీ థ్రిల్లర్‌ కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు.ఈ చిత్రంలో నటించిన అనుభవాన్ని నటి రైసా విల్సన్‌ తెలుపుతూ ఇది ఒక కథలో మరో కథ అనే విభిన్న కథాంశంతో రూపొందిన చిత్రం అని చెప్పారు. ఇందులో నేను ఫ్లాష్‌ బ్యాక్‌ లో వచ్చే. సన్నివేశాల ముఖ్యమైన పాత్రలో నటించినట్లు చెప్పారు. ఇలాంటి కథా చిత్రంలో తాను ఇంతకు ముందు ఎప్పుడూ నటించలేదనీ, అందుకే కథ నచ్చడంతో వెంటనే నటించడానికి సమతించినట్లు చెప్పారు.కేరళాలోని మరైయూర్‌ అడవుల్లో ఈ చిత్రం షూటింగ్‌ జరిగిందన్నారు అనుమతి లభించడమే కష్టం అయినా గంధపు చెట్ల నడుము రక్తాన్ని పీల్చే పురుగులు, అధిక మంచు, వర్షం అడవి జంతువులు వంటి భయాన్ని కలిగించే ప్రాంతంలో షూటింగ్‌ చేశాం అని చెప్పారు. అయితే అంత శ్రమ ఉంటుందని తాను ముందు ఊహించలేదు అన్నారు. ఇంతకు ముందు నటించిన చిత్రాలకు ఇంత కష్టపడలేదన్నారు. ఈ చిత్రంలో ఒల్లు గగుర్పాటు చెందేలాంటి పోరాట సన్నివేశాల్లో నటించినట్లు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement