డిజిటల్‌ డేటా పెయింటింగ్‌లతో అద్భుత సమ్మేళనం | - | Sakshi
Sakshi News home page

డిజిటల్‌ డేటా పెయింటింగ్‌లతో అద్భుత సమ్మేళనం

Jun 9 2026 5:36 AM | Updated on Jun 9 2026 5:36 AM

సాక్షి, చైన్నె: చైన్నె నగరంలోని ప్రముఖ ఆర్ట్‌ గ్యాలరీ ’అశ్వితాస్‌’లో అంతర్జాతీయ గుర్తింపు పొందిన సమకాలీన కళాకారుల ద్వయం తుక్రాల్‌ – తాగ్రా రూపొందించిన సరికొత్త కళాఖండాల ప్రదర్శనకు ఉంచారు. మైమెసిస్‌ను ప్రతిష్టాత్మకంగా ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. డిజిటల్‌ డేటా పెయింటింగ్‌లతో అద్బుత సమ్మేళనంగా ఇక్కడ చిత్రాలను కొలువు దీర్చారు. ఈ అద్భుతమైన ప్రదర్శన జూలై 17వ తేది వరకు జరగనున్నది. మంగళవారం నుండి శనివారం వరకు, సాయంత్రం 4.00 గంటల నుండి రాత్రి 7.00 గంటల వరకు ముందస్తు అనుమతితో సందర్శించవచ్చు అని నిర్వాహకు లు సోమవారం ప్రకటించారు. ఆర్బోరెటమ్‌ నుండి మైమెసిస్‌ వరకు తుక్రాల్‌ – తాగ్రా గతంలో నిర్వహించిన ఆర్బోరెటమ్‌ సిరీస్‌ విజయవంతమైన నేపథ్యంలో, దానికి కొనసాగింపుగా ఈ ’మైమెసిస్‌’ రూపుదిద్దుకుంది. వృక్షాలు, మానవ స్మృతులు, సజీవ ఆర్కై వ్‌ల చుట్టూ సాగిన ప్రయాణం తాజాగా సేంద్రీయ పర్యావరణ వ్యవస్థల నుండి డిజిటల్‌ క్షేత్రాలలోకి అడుగుపెట్టింది. డిజిటల్‌ ప్రపంచంలో పిక్సెల్‌లు, బా ర్‌లు, విచ్ఛిన్నమైన విజువల్‌ యూనిట్లుగా ఎలా రూ పాంతరం చెందుతుందో ఈ ఎగ్జిబిషన్‌ అన్వేషిస్తుండటం విశేషం. ఊహాజనిత డేటా రూపాలతో కూడిన వందలాది పెయింటెడ్‌ కాన్వాస్‌ల ద్వారా.. వేగవంతమైన డిజిటల్‌ వ్యవస్థలను చిత్రలేఖనంలోని స్పర్శాత్మకమైన భౌతికత్వంతో ఎలా అనుసంధానించవచ్చో ఈ కళాఖండాలు అద్భుతంగా ఆవిష్కరిస్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement