ధాన్యం కొనుగోలు చేయాలని వినతి | - | Sakshi
Sakshi News home page

ధాన్యం కొనుగోలు చేయాలని వినతి

Jun 9 2026 5:36 AM | Updated on Jun 9 2026 5:36 AM

తిరువళ్లూరు: రైతుల నుంచి వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వెంటనే చేపట్టాలని కోరుతూ దాదాపు 20 మంది రైతులు కలెక్టర్‌ కవితకు సోమవారం ఉదయం వినతి పత్రం సమర్పించా రు. తిరువళ్లూరు జిల్లా పూండి యూనియన్‌లోని ఎరయూరు, మన్నవేడు, రాజపాళ్యం, సోమదేవన్‌పట్టు, ఒదపై, కొరక్కతండలం, మొయ్యూరు, రాజపాళ్యంతో పాటు పది గ్రామాలకు చెందిన దాదాపు వంద మంది రైతులు ఉన్నారు. దాదాపు 500 హెక్టారులో వరి సాగులో ఉంది. ఇక్కడి రైతులు సాగు చేసిన వరి పంటలను మన్నవేడులోని ప్రభుత్వం ఏర్పాటు చేసి వరి కొనుగోలు కేంఽద్రం ద్వారా కొనుగోలు చేయాల్సి వుంది. అయితే కొంత మంది రైతుల నుంచి మాత్రమే వరిని కొనుగోలు చేసి అధికారులు చేతులు దులుపుకున్నట్టు తెలుస్తోంది. దాదాపు 5 వేల వరి బస్తా లు వర్షంలో తడుస్తున్నా ఇంత వరకు ప్రభుత్వం కొనుగోలు చేయలేదని, అఽధికారులను కోరితే ప్రభుత్వం నిర్ధేశించి లక్ష్యం మేరకు కొనుగోలు చేశామని, ఉన్నత అధికారుల నుంచి ఉత్తర్వులు వస్తే తప్ప మళ్లీ కొనుగోలు చేయలేమని సమాధానమిస్తునన్నట్టు కలెక్టర్‌ కవితను కలిసి సోమవారం రైతులు వినతి పత్రం సమర్పించారు. దాదాపు నెల రోజుల నుంచి వేచివున్నా ఇంత వరకు తమ ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయలేదని వాపోయారు. న్యాయం జరిగేలా చూస్తామని కలెక్టర్‌ వారికి హమీ ఇచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement