వేలూరు: మహిళలు స్వయం ఉపాధితో అభివృద్ధి చెందాలని కలెక్టర్ వీఎస్ లీల అన్నారు. వేలూరు కలెక్టరేట్‌లో ప్రజా విన్నపాల దినోత్సవం సోమవా రం జరిగింది. ఇందులో జిల్లా నలుమూలల నుంచి ప్రజలు వివిధ సమస్యలపై వినతిపత్రం సమర్పించుకున్నారు. అదే విధంగా ప్రజలు ఇచ్చిన సమస్యలను తీసుకున్న వివిధ శాఖల ఉన్నతాధికారులు వాటిలో కొన్నింటిని అక్కడిక్కడే పరిష్కరించగా మరిన్ని వినతులపై విచారణ జరిపి న్యాయం చేస్తామని తెలిపారు. అదే విధంగా వివిధ శాఖల ద్వారా ప్రజలకు వివిద సంక్షేమ పథకాలను కలెక్టర్ అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ ప్రజల నుంచి వచ్చే సమస్యలను 15 రోజుల్లో పు ఆయా శాఖల అధికారులు నేరుగా విచారణ జరి పి న్యాయం చేయాలన్నారు. అదేవిధంగా గ్రీవెన్‌సెల్‌కు అన్ని శాఖల అధికారులు హాజరు కావాలన్నా రు. ఇదిలా ఉండగా కొత్త ప్రభుత్వం ఏర్పడటంతో సంక్షేమ పథకాలు అధికంగా వచ్చే అవకాశం ఉందనే ఆశతో అర్జీదారులతో కలెక్టరేట్ నిండి పోయింది. జిల్లా రెవవెన్యూ అధికారి శివసుబ్రమణియన్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


