● యువకుడి అరెస్ట్
తిరువొత్తియూరు: చెంగల్పట్టు సమీపంలో 14 ఏళ్ల బాలికను పెళ్లి చేసుకుంటానని ఆశచూపి, అపహరించి లైంగిక వేధింపులకు గురిచేసిన శక్తివేల్ (19) అనే యువకుడిని పోలీసులు పోక్సో చట్టం కింద అరెస్ట్ చేశారు. బాలిక తల్లి తన భర్తకు దూరంగా ఉంటూ, తన పిల్లలతో కలిసి పడప్పై ప్రాంతంలో నివసిస్తోంది. అదే ప్రాంతానికి చెందిన శక్తివేల్ అనే యువకుడు ఈ బాలికను ప్రేమిస్తున్నానని నమ్మించి, గతంలో ఒకసారి అపహరించాడు. అతని వద్ద నుంచి బాలికను విడిపించుకొని హెచ్చరించి అతన్ని వదిలేశారు. మళ్లీ ఇప్పుడు ఆ బాలికను తీసుకుని పరారవ్వడంతో, తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల విచారణలో శక్తివేల్ తన అన్న ఇంట్లో బాలికతో కలిసి దాక్కున్నట్లు తెలిసింది. పోలీసులు అక్కడికి చేరుకుని బాలికను రక్షించి, నిందితుడు శక్తివేల్ ను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచి జైలుకు తరలించారు.
తిరువొత్తియూరు: చైన్నె తురైపాక్కం రేడియల్ రోడ్డులో బైక్‌లు ఢీకొని యువకుడు మృతి చెందారు మరో ఇద్దరు స్నేహితులకు తీవ్ర గాయాలు అయ్యాయి చైన్నె వేళచ్చేరి సమీపంలోని పెరియ కోవిలంబాక్కంకు చెందిన జగన్నాథన్ (23) పెయింటర్.ఇతను తన స్నేహితులు రమేష్ (46), అన్బళగనన్‌తో కలిసి మద్యం సేవించి, బైక్‌పై వెళ్తుండగా తురైపాక్కం 200 అడుగుల రేడియల్ రోడ్డులో ఓ ప్రైవేట్ కార్ సర్వీస్ సెంటర్ వద్ద వేగంగా వచ్చిన మరో బైక్ వీరిని ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ముగ్గురిని వెంటనే తాంబరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడ జగన్నాథన్ మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. రమేష్, అన్బళగన్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పల్లికరణై ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వేలూరు: జాతీయ రహదారిలో బ్యాటరీలు తీసుకెళ్తున్న లారీ ఉన్న ఫలంగా దగ్ధం కావడంతో సుమారు గంట పాటూ ట్రాఫిక్ స్తంభించింది. వివరాలు.. చైన్నె నుంచి పూనేలోని ఓ ప్రైవేటు ఐటీ కంపెనీకి బ్యాటరీలను తీసుకెళ్తు లారీ వేలూరు జిల్లా పల్లిగొండ వద్ద జాతీయ రహదారిపై మంటల్లో చిక్కుకుంది. వెంటనే అప్రమత్తమైన క్రిష్ణగిరికి చెందిన లారీ డ్రైవర్ తమిళరసన్ వెంటనే లారీని రోడ్డు పక్కన నిలిపి వేసి అక్కడ నుంచి పరుగులు తీశాడు. అప్పటికే లారీలోని బ్యాటరీలు పెద్ద శబ్దంతో పేలుతూ మంటలు చెలరగేడంతో చేసేది లేక అక్కడ నుంచి పరుగులు తీశారు. వెంటనే విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసేందుకు యత్నించారు. అయితే అప్పటికే లారీలోని బ్యాటరీలు పూర్తిగా దగ్ధమైంది.


