ఎస్పీబీకి భారత రత్న ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

ఎస్పీబీకి భారత రత్న ఇవ్వాలి

Jun 9 2026 5:36 AM | Updated on Jun 9 2026 5:36 AM

కొరుక్కుపేట: గాన గాంధర్వుడు, దిగ్గజ గాయకుడు ఎస్పీ బాల నుబ్రహ్మణ్యానికి భారతరత్న ఇవ్వాలని డాక్టర్‌ ఎస్పీబీ కల్చరల్‌ ట్రస్ట్‌ –చైన్నె, డాక్టర్‌ ఎస్‌.పి బి కల్చరల్‌ కాన్సెర్ట్‌ తరపున కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్టు ఆ ట్రస్ట్‌ వ్యవస్థాపక అధ్యక్షులు కేఎం కొండయ్య తెలిపారు. ఈ మేరకు డాక్టర్‌ ఎస్పీబీ కల్చరల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో డాక్టర్‌ ఎస్‌ పి బాల సుబ్రమణ్యం 80వ జయంతిని ఆదివారం రాత్రి ఘనంగా జరుపుకున్నారు. దీనికి చైన్నె అరుంబాక్కంలోని పిల్లయార్‌ కోయిల్‌ వీదిలో ఉన్న సౌండ్‌ ప్రో డబ్బింగ్‌ స్టూడియో వేదికై ంది. ముఖ్యఅతిధిగా ప్రముఖ గాయకులు, ఎస్పీబీ సన్నిహితులు తులసీధరన్‌ పాల్గొని కేక్‌ కట్‌ చేశారు. అనంతరం ఎస్పీబి తో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కన్నీటి పర్యాంతం అయ్యారు. బాలుకు ఇష్టమైన పాటలను ఆలపించి తులసీ ధరన్‌ ఆకట్టుకున్నారు. ఎస్పీబీ జయంతి సందర్భంగా గాయనీ గాయకులకు, ట్రస్ట్‌ కు సహకరిస్తున్న దాతలకు ఎస్పీబీ అవార్డులను అందజేశారు. అలాగే ప్లస్‌ టూ పబ్లిక్‌ పరీక్షల్లో 500లకు 493 మార్కులు సాధించిన కమలేష్‌ అనే విద్యార్థిని ఘనంగా సత్కరించి పతకాన్ని, నగదు ప్రోత్సాహాన్ని అందించారు. ఈ సందర్భంగా కెఎం కొండయ్య మాట్లాడుతూ చైన్నె బీచ్‌ నుంచి తామరైపాక్కంలో ఉన్న ఎస్పీబీ సమాధి వద్దకు ప్రత్యేక బస్సును వేయాలని కోరారు. ఇందులో ట్రస్ట్‌ ట్రెజరర్‌ కె.బాలాజీ రావు, డాక్టర్‌ ఎస్పీబీ కల్చరల్‌ కాన్సెర్ట్‌ ప్యాట్రన్‌ కె సౌందరరాజన్‌తోపాటూ ఎస్‌ఎన్‌ దురై, రమేష్‌, కృష్ణ వేణి, విజయ బాలు,, అజయ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement