ప్రభుత్వ సిబ్బందిపై అనుచిత వ్యాఖ్యలు | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ సిబ్బందిపై అనుచిత వ్యాఖ్యలు

Jun 9 2026 5:36 AM | Updated on Jun 9 2026 5:36 AM

●యూట్యూబర్‌ అరెస్టు

తిరువళ్లూరు: తిరువళ్లూరు జిల్లా కనకమ్మసత్రం ప్రాంతానికి చెందిన చెందిన 14 ఏళ్ల వయస్సు వున్న మైనర్‌ బాలికకు అరక్కోణం ప్రాంతానికి చెందిన కయళ్‌విళియన్‌ మధ్య గత 2024 వ సంవత్సరం నుంచి ప్రేమ వ్యవహారం సాగుతున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అప్పట్లో బాలిక గర్బం దాల్చిన క్రమంలో కయల్‌విళియన్‌ను పోక్సో చట్టం కింద అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అనంతరం అతడిపై గూండా చట్టాన్ని సైతం ప్రయోగించిన క్రమంలో దాదాపు ఏడాది పాటు పుళల్‌ జైలు శిక్షను అనుభవించి ఇటీవలే బెయిల్‌పై విడుదలయ్యాడు. బెయిల్‌పై వచ్చిన కయళ్‌విళియన్‌ మళ్లీ బాలికతో ప్రేమ వ్యవహరం నడిపినట్టు తెలుస్తోంది. దీంతో బాలిక గర్బం దాల్చిడంతో ఆమె తల్లిదండ్రులు తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాల డాక్టర్‌లను ఆశ్రయించారు. పోలీసులు, సాంఘిక సంక్షేమశాఖ అధికారుల అనుమతితో తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాల డాక్టర్‌లు బాలికకు అబార్షన్‌ చేయాలని నిర్ణయించారు. ఇందు కోసం బాలికతో పాటు ఆమె తల్లి ఆదివారం తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాలకు వచ్చారు. బాలికతో పాటు ఆమె తల్లి మాత్రమే లోపలికి రావాలని కోరగా, యూట్యూబర్‌ మధుమిత సైతం తాను ఆపరేషన్‌ రూమ్‌కు వస్తానని కోరారు. అందుకు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ శివగామసుందరి నిరాకరించడంతో డాక్టర్‌లు, నర్సులు, హాస్పిటల్‌ సిబ్బందిని దుర్బుషలాడారు. అసిస్టెంట్‌ ప్రోఫెసర్‌ శివగామ సుందరి తిరువళ్లూరు టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి మధుమితను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement