ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌లో కొత్త విధానం | - | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌లో కొత్త విధానం

Jun 8 2026 7:12 AM | Updated on Jun 8 2026 7:12 AM

● సీఎం విజయ్‌ ప్రభుత్వం నిర్ణయం

సాక్షి, చైన్నె: తమిళనాడు రిజిస్ట్రేషన్‌ శాఖ ప్రజల సౌకర్యార్థం ఒక విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టింది. సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు వెళ్లకుండానే ఎక్కడి నుండైనా, ఎప్పుడైనా ఆన్‌లైన్‌ ద్వారా పత్రాల రిజిస్ట్రేషన్‌ చేసుకునే ‘ఎనీవేర్‌ రిజిస్ట్రేషన్‌’ విధానాన్ని త్వరలోనే విధిగా అమలు చేయనున్నట్లు రిజిస్ట్రేషన్ల శాఖ సీఎం విజయ్‌ ఆదేశాలుతో ప్రకటించింది. ఈ డాక్యుమెంట్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను మరింత సరళతరం చేయడానికి, అవినీతికి తావులేకుండా చేయడానికి ఈ డిజిటల్‌ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీని ద్వారా ప్రజలు ఏడాదిలో 365 రోజులు, 24 గంటల పాటు ఎక్కడి నుండైనా తమ పత్రాలను వెబ్‌సైట్‌ ద్వారా నమోదు చేసుకోవచ్చు. పత్రాల పరిశీలన పూర్తి చేసి సబ్‌రిజిస్ట్రార్‌ ఆమోదం తెలపగానే, ఆయన డిజిటల్‌ సంతకంతో కూడిన అసలు పత్రం నేరుగా లబ్ధిదారుడి అకౌంట్‌ లాగిన్‌లోకి లేదా వారి మొబైల్‌ వాట్సాప్‌ నంబర్‌కు పంపుతారు. దాన్ని వారు సులభంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ఆఫీసుకు వెళ్లకుండానే రిజిస్ట్రేషన్‌ అయ్యే పత్రాలు

తొలిదశలో పత్రాల రిజిస్ట్రేషన్‌కు కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదని ప్రకటించారు. తమిళనాడు హౌసింగ్‌ బోర్డు విక్రయ పత్రాలు,బ్యాంకుల నుండి పొందే రుణాల తాలూకు మార్టిగేజ్‌, రశీదు పత్రాలు. సజావుగా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి కావడానికి ప్రజలు, నిర్మాణ సంస్థలు, డాక్యుమెంట్‌ రైటర్లు, బ్యాంకులు, న్యాయవాదులు రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారిక వెబ్‌సైట్‌లో సొంతంగా లాగిన్‌ ఐడీ క్రియేట్‌ చేసుకొని పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.

బయోమెట్రిక్‌ వెరిఫికేషన్‌ తప్పనిసరి

ఈ ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో మోసాలను అరికట్టడానికి భద్రతా ప్రమాణాలను కఠినతరం చేశారు. పత్రాలు రాసిచ్చేవారు, రాసి తీసుకునేవారు, సాక్షులు వీరందరి అధికారిక గుర్తింపు కార్డును వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయడం తప్పనిసరి చేశారు.

అలాగే ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ద్వారా వేలిముద్రలు లేదా కంటిపాప (ఐరీష్‌) గుర్తింపు ప్రక్రియతో బయోమెట్రిక్‌ వెరిఫికేషన్‌ పూర్తి చేయాల్సి ఉంటుంది.

అవసరమైన సాంకేతిక పరికరాలు

ఈ సేవలను వినియోగించుకోవడానికి వినియోగదారుల వద్ద మంచి ఇంటర్నెట్‌ కనెక్షనన్‌తో పాటు, ప్రభుత్వం అఽఽఽధీకృతం చేసిన ఎల్‌1 వేలిముద్రల స్కానర్‌ లేదా ఐరిష్‌ స్కానర్‌, వెబ్‌క్యామ్‌ ఉండాలి.

సందేహాల నివృత్తికి హెల్ప్‌లైన్‌ నంబర్లు

ఈ సరికొత్త ఆన్‌లైన్‌ విధానంలో ప్రజలకు లేదా అధికారులకు సాంకేతిక సమస్యలు తలెత్తితే సంప్రదించాల్సిన నంబర్లను ప్రభుత్వం విడుదల చేసింది. హార్డ్‌వేర్‌ సమస్యల కోసం–మహ్మద్‌ యూనస్‌, అరుణ్‌ కుమార్‌ – 7397574067, 9940446694, సాఫ్ట్‌వేర్‌ సమస్యల కోసం– శ్రీనివాస్‌ గణేష్‌, ఢిల్లీబాబు – 63697 98973, 85258 05957 నెంబర్లను ప్రకటించారు.

Advertisement
 
Advertisement
Advertisement