అన్నామలైతో బీజేపీకి నష్టం లేదు | - | Sakshi
Sakshi News home page

అన్నామలైతో బీజేపీకి నష్టం లేదు

Jun 8 2026 7:12 AM | Updated on Jun 8 2026 7:12 AM

● పార్టీ మరింత బలంగా ఉంది ● తమిళసై సౌందరరాజన్‌

సాక్షి,చైన్నె: తమిళనాడు బీజేపీ సీనియర్‌ నాయకురా లు తమిళసై సౌందరరాజన్‌ ప్రస్తుత రాష్ట్ర రాజకీయాల పై, పార్టీ అంతర్గత పరిణామాలపై సంచలన వ్యాఖ్య లు చేశారు. మాజీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై పార్టీని వీడి వెళ్లినంత మాత్రాన బీజేపీ బలహీనపడలేదని, ఆయన వెళ్లాకే పార్టీ మరింత బలంగా మారిందని ఆమె స్పష్టం చేశారు. మదురై మీనాక్షి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం తమిళసై సౌందరరాజన్‌ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన తమిళగ వెట్రి కళగం ప్రభుత్వంపై, విద్యుత్‌ శాఖ మంత్రిపై , అన్నామలై కొత్తగా పెట్టిన రాజకీయ ప్రస్థానంపై ఆమె ఘాటుగా విమర్శలు గుప్పించారు. హిందూ ప్రజల సెంటిమెంట్లను, దైవ భక్తిని గౌరవించనందుకే గత ఎన్నికల్లో డీఎంకే ఘోర పరాజయాన్ని చవిచూసి, అధికారాన్ని కోల్పోయిందన్నారు. తిరుప్పరంకుండ్రం ఆలయ దీపస్తంభంపై దీపం వెలిగించే విషయంలో కోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ, శాంతిభద్రతల పేరిట భక్తుల భావాలను గాయపరచడం కరెక్ట్‌ కాదన్నారు. ఈ విషయంలో గత డీఎంకే ప్రభుత్వం చేసిన తప్పులనే ప్రస్తుత ప్రభుత్వం కూడా పునరావృతం చేస్తునదని మండిపడ్డారు. విద్యుత్‌ శాఖలో 26 హార్డ్‌ డిస్క్‌లు మాయమవడం వెనుక ఉన్న అవినీతిని దాచడానికే మంత్రి నిర్మల్‌ కుమార్‌ ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు.

అన్నామలై వెళ్తే పోయేదేమీ లేదు

అన్నామలై కొత్తగా ప్రారంభించిన ఉద్యమం, పార్టీలో లక్షలాది మంది చేరుతున్నారనే ప్రచారంపై తమిళసై తీవ్రంగా స్పందించారు. బీజేపీ పార్టీ కోసం రక్తం, చె మట చిందించిన అసలైన కార్యకర్తలు ఇప్పటికీ పార్టీలోనే ఉన్నారన్నారు.. కేవలం స్వార్థపరులు మాత్రమే పార్టీని వీడి వెళ్లారన్నారు. ప్రజా సేవ చేయాలనుకునే వారు ఎక్కడికీ పోలేదు. అన్నామలై రాకతో పార్టీకి అ దనంగా వచ్చిన బలమేమీ లేదన్నారు. ఆయన వెళ్లినంత మాత్రాన పార్టీ కోల్పోయిన బలమేమీ లేదన్నారు. బీజేపీలో ఉన్న ఒక తామర రేకును కూడా ఎవరూ కదల్చలేరని, 2031లో తమిళనాడులో బీజేపీ ఒంటరిగానే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తంచేశారు.

మోదీ, అమిత్‌ షా మద్దతు లేదు

బీజేపీకి ఉన్నది ఒకటే ముఖం అని, వేరే ముసుగులు వేసుకొని రాజకీయం చేయాల్సిన అవసరం తమకు లేదన్నారు. అన్నామలై వెనుక ప్రధాని మోదీ, అమిత్‌ షాల మద్దతు ఏమాత్రం లేదన్నారు. ఆయన పార్టీ ఎందుకు వీడారో ఆయననే అడగాలి అని ఆమె పేర్కొన్నా రు. తమిళనాడులో కొత్తగా ఏర్పడిన విజయ్‌ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం ప్రభుత్వం నెల రోజుల పాలనను తడబడుతూ పూర్తి చేసిందని తమిళసై విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, గంజాయి, డ్రగ్స్‌ సంస్కృతి పెరిగిందన్నారు. వృద్ధులు, చిన్న పిల్లలపై లైంగిక దాడులు జరుగుతు న్నా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఈ ప్రభుత్వం ఐదేళ్లు పూర్తి చేసుకుంటుందా లేదా అనేది వారి చేతుల్లో లేదన్నారు. ఈ ప్రభుత్వ తలరాత ప్రస్తుతం కమ్యూనిస్టులు, వీసీకే చేతుల్లో ఉందన్నారు. వెనుక నుండి డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్‌ వీరికి తాత్కాలికంగా మద్దతు ఇస్తున్నారన్నారు. ఈ సపోర్ట్‌ తీసేస్తే ఈ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని తమిళసై సౌందరరాజన్‌ వ్యాఖ్యానించారు.

Advertisement
 
Advertisement
Advertisement