సాక్షి, చైన్నె: అరక్కోణం రైల్వే యార్డులో అత్యవసర ఇంజినీరింగ్, ట్రాక్ ఆధునీకరణ పనులు జరగనున్నందున, చైన్నె సబర్బన్ పరిధిలో నడిచే 47 ఎలక్ట్రికల్ (లో కల్) రైళ్ల సర్వీసుల్లో మార్పులు చేసినట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఈ మార్పులు సోమవారం 8వ తేదీ నుంచి ఈనెల 12వ తేదీ వరకు మొత్తం 5 రోజులు అమలులో ఉంటాయని వివరించారు. ఈ మేరకు చైన్నె రైల్వే డివిజన్ ఒక అధికారిక ప్రకటన విడుదల చేస్తూ.. పలు రైళ్లను పూర్తిగా, మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు తెలిపింది.
పూర్తిగా రద్దయిన రైళ్లు
జూన్ 8 నుండి 12వ తేదీ వరకు 5 రైళ్లు పూర్తిగా రద్దు చే శారు. ఇందులొఓ అరక్కోణం – తిరుత్తణి మధ్య తెల్లవారుజామున 4.00 గంటలకు, 5:00 గంటలకు నడిచే లోకల్ రైళ్లు, తిరుత్తణి – అరక్కోణం మధ్య రాత్రి 9:15 గంటలకు, 11:10 గంటలకు నడిచే లోకల్ రైళ్లు. తిరుత్తణి – చైన్నె సెంట్రల్ మధ్య ఉదయం 6:30 గంటలకు నడిచే లోకల్ రైలు ఉన్నాయి
పాక్షికంగా రద్దయిన రైళ్లు
చైన్నె సెంట్రల్,బీచ్ నుండి అరక్కోణం వైపు వెళ్లే పలు రైళ్లను తిరువాలాంగడు స్టేషన్ వరకే పరిమితం చేశారు. ఇవి తిరువాలాంగడు – అరక్కోణం మధ్య నడవవు అని ప్రకటించారు. ఇందులో చైన్నె బీచ్ – అరక్కోణం మధ్య తెల్లవారుజామున 4.05, మధ్యాహ్నం 2.25 గంటల రైళ్లు, ఆవడి – అరక్కోణం మధ్య ఉదయం 6.20 గంటల రైలు, చైన్నె సెంట్రల్ – అరక్కోణం మధ్య ఉదయం 6.30, 9.10, 10.30, 11.00, మధ్యాహ్నం 12.40, 1.25, రాత్రి 3.45, సాయంత్రం 4.45, 5.15, 5.45, 6.05, 6.40, రాత్రి 7.30, 8.20, 9.10, 10.00, 10.55 గంటలకు బయలుదేరే రైళ్లు తిరువాలాంగడు వరకే నడుస్తాయి. అలాగే అరక్కోణం నుండి చైన్నె సెంట్రల్‌కు బయలుదేరాల్సిన కింద పేర్కొన్న సమయాల రైళ్లు అరక్కోణానికి బదులుగా తిరువాలాంగడు స్టేషన్ నుండే చైన్నెకి తమ ప్రయాణాన్ని ప్రారంభిస్తారం. ఈమేరకు తెల్లవారుజామున 3.45, 4.25, 5.25, ఉదయం 6.40, 8.15, 8.55, 11.15, మధ్యాహ్నం 2.25, రాత్రి 3.40, సాయంత్రం 4.50, 6.00, 7.00, 7.25, రాత్రి 8.25, 8.50, 9.45 గంటల రైళ్లు ఇందులో ఉన్నాయి. ఇవి కాకుండా అరక్కోణం – చైన్నె బీచ్ మధ్య నడిచే మరో 4 లోకల్ రైళ్లు కూడా పాక్షికంగా రద్దయ్యాయి.


