సాక్షి, చైన్నె : సీబీఎస్‌ఈ పాఠశాలల్లో సిలబస్ ద్వారా హిందీ భాషను బలవంతంగా రుద్దడాన్ని నిరసిస్తూ, అలాగే విశ్వవిద్యాలయాల అధికారాలను లాగేసుకునే వీపీఎస్‌ఏ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జూన్ 23వ తేదీన చైన్నెలోని లోక్ భవన్, పుదుచ్చేరిలోని లోక్ నివాస్‌ను ముట్టడించనున్నట్టు డీఎంకే విద్యార్థి విభాగం ప్రకటించింది. వివరాలు.. పుదుచ్చే రి రాష్ట్ర డీఎంకే విద్యార్థి విభాగం ఆఫీస్ బేరర్లు, నియోజకవర్గ స్థాయి ప్రతినిధుల అత్యవసర సమీక్షా సమావేశం ఆదివారం పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగింది. డీఎంకే పుదుచ్చేరి రాష్ట్ర కన్వీనర్ శివ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తమిళనాడు డీఎంకే విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి వీరమణి ముఖ్య అతిథిగా పాల్గొని దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశం అనంతరం వీరమణి మీడియాతో మాట్లాడుతూ.. విద్యావ్యవస్థలో జరుగుతున్న పరిణామాలపై తమిళనాడులోని ప్రస్తుత తమిళగ వెట్రి కళగం ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
విద్యావ్యవస్థను తాకట్టు పెడుతున్నారు
పీఎం శ్రీ పేరిట పాఠశాలల వ్యవహారంలో తమిళనాడులోని టీవీకే ప్రభుత్వం పూర్తిగా మౌనం వహిస్తోందని ధ్వజమెత్తారు. దీనిపై పరిశీలిస్తున్నామని విద్యాశా ఖ మంత్రి చెబుతుండటం హాస్యాస్పదం. విద్యావ్యవస్థను కేంద్రానికి తాకట్టు పెట్టేందుకు టీవీకే ప్రభుత్వం సన్నద్దమైందన్నారు. జూలై నెల నుండి సీబీఎస్‌ఈ స్కూళ్లలో త్రిభాషా విధానాన్ని అమలు చేయాలని ప్ర యత్నిస్తునదన్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అమ లు చేయనివ్వమని, తమిళనాడులో హిందీని దొడ్డి దా రిన తీసుకురావాలని చూస్తున్నారని మండిపడ్డారు. 9 వ తరగతిలో మూడో భాషకు మార్కులు ఉండవని చె బుతారని, అయితే, ఆ తర్వాత 10వ తరగతికి వచ్చే సరికి అదే మార్కులను తప్పనిసరి చేస్తారన్నారు. ఇది విద్యార్థులపై తీవ్ర ఒత్తిడిని పెంచడమేనని పేర్కొన్నా రు. సీబీఎస్‌ఈ సిలబస్ ద్వారా జరుగుతున్న హిందీ వి ధింపును అడ్డుకోవడానికి, వర్సిటీల స్వయంప్రతిపత్తి ని దెబ్బతీసే వీపీఎస్‌ఏ విధానాన్ని రద్దు చేయాలని డి మాండ్ చేస్తూ జూన్ 23న చైన్నెలోని గవర్నర్ బంగ్లా లోక్‌భవన్, పుదుచ్చేరిలోని లోక్ నివాస్‌ల ముట్టుడి ది శగా డీఎంకే విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో భారీ ఎ త్తున నిరసన ప్రదర్శన, ధర్నా చేపట్టనున్నట్లు వీరమ ణి స్పష్టం చేశారు. పుదుచ్చేరి డీఎంకే విద్యార్థి విభాగం నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


