విక్రమ్‌ @63 | - | Sakshi
Sakshi News home page

విక్రమ్‌ @63

Jun 8 2026 7:06 AM | Updated on Jun 8 2026 7:06 AM

విక్రమ్‌

రియా శిబు

తమిళసినిమా: విక్రమ్‌ చిత్రం అంటేనే సమ్‌ థింగ్‌ స్పెషల్‌గా ఉంటుంది. వీర ధీర సూరన్‌ చిత్రం తర్వాత చిన్న గ్యాప్‌ తీసుకుని నటించడానికి సిద్ధమయ్యారు విక్రమ్‌. ఈయన నటిస్తున్న 63వ చిత్రం ఆదివారం పూజాకార్యక్రమాలతో ప్రారంభమైనట్టు సమాచారం. ఈ చిత్రానికి ఆనంద్‌ శంకర్‌ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఇంతకు విక్రమ్‌, దర్శకుడు ఆనంద్‌ శంకర్‌ కాంబినేషన్లో ఇరుమురున్‌ అనే చిత్రం 2016లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. 10 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ కాంబో రిపీట్‌ అవుతోంది. ఇందులో సర్వంమాయ మలయాళ చిత్రం ఫేమ్‌ రియాశిబు కథానాయకిగా నటిస్తున్నారు. ఈమె ఇంతకుముందు విక్రమ్‌ హీరోగా వీర ధీర సూరన్‌ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. ఇంకా పేరు నిర్ణయించని విక్రమ్‌ 63వ చిత్రాన్ని సత్య జ్యోతి ఫిలిమ్స్‌ సంస్థ నిర్మిస్తోంది. సంతోష్‌ నారాయణన్‌ సంగీతాన్ని అందిస్తున్న చిత్రంలోని పాత్ర కోసం విక్రమ్‌ దర్శకుడి సూచనల మేరకు మేకోవర్‌ అయినట్లు సమాచారం. ఎంఎస్‌ భాస్కర్‌, ఊర్వశి ముఖ్య పాత్రలు పోషిస్తున్నట్లు తెలిసింది. మరిన్ని వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.

తమిళసినిమా: అందం, ఐశ్వర్యం, ఆనందం, ఆసక్తి, ఆకర్షణ, నిరాకరణ, సంతృప్తి, అసంతృప్తి, ఆవేదన అన్నీ కలగలిపిన పరిశ్రమ సినిమా. ఇక్కడ ప్రతిభ, అదృష్టాలను పరీక్షించుకుని ఉన్నంత స్థాయికి చేరుకున్న వారు ఎందరో. తమ కలలను పండించుకోవడానికి నిరంతరం శ్రమిస్తున్నా వారు ఉన్నారు. అదే సమయంలో వివక్ష గొంతెత్తే వారు ఉంటూనే ఉన్నారు. అలాంటి వారిలో ఇప్పుడు కాజల్‌ అగర్వాల్‌ చేరారు. లక్ష్మీకల్యాణం అనే తెలుగు చిత్రంతో కథానాయికిగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత వరుసగా అవకాశాలను అందుకుంటూ అగ్ర కథానాయిక స్థాయికి చేరారు. కాజల్‌ బిజీగా ఉన్న తరుణంలోనే పెళ్లి చేసుకుని సంసార జీవితంలోకి ప్రవేశించారు. అలా ఒక బిడ్డకు తల్లి కూడా అయినా ఈ ఉత్తరాది భామ మళ్లీ నటనపై దృష్టి పెట్టారు. కాజల్‌ తాజాగా నటించిన ది ఇండియా స్టోరీ చిత్రం జూలై 24న తెరపైకి రానుంది. కమలహాసన్‌తో కలిసి నటించిన ఇండియన్‌– చిత్రం విడుదల కావలిసి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కాజల్‌ సందర్భం వచ్చినప్పుడల్లా గ్లామర్‌ ను ప్రదర్శిస్తూ అవకాశాల వేటలో పడుతున్నారు. తాజాగా చిత్రపరిశ్రమలో వివక్ష గురించి ఒక ఇంటర్వ్యూలో తన ఆవేదనను వ్యక్తం చేశారు. పారితోషికం విషయంలో ఆడ, మగ మధ్య వివక్ష లేదని చెప్పలేను కానీ ఈ పరిస్థితి మారాలి. సినిమా ఇప్పుడు కార్పొరేట్‌గా మారిపోతోంది. అయినా ఆడ, మగ మధ్య పారితోషికం విషయంలో వివక్ష కొనసాగుతూనే ఉంది. నాకు దక్షిణాది చిత్ర పరిశ్రమపై ఆసక్తి ఎక్కువ. నాకు అక్కడ లేని సౌకర్యం దక్షిణాది చిత్ర పరిశ్రమలో కలుగుతుందని కాజల్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు.

త్వరలో ది ఒన్‌ విత్తిన్‌ యూ

తమిళసినిమా: హరీష్ణి పిక్చర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పతాకంపై గోపాల్‌ బాలకృష్ణన్‌, శివరామనాథన్‌ కలిసి నిర్మిస్తున్న చిత్రం ది ఒన్‌ విత్తిన్‌ యూ. ఆదిరా రాకెప్పన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం టైటిల్‌, టీజర్‌లను విడుదల చేశారు. చిత్రం వివరాలను దర్శకుడు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తెలుపుతూ ఇది హైపర్‌ లింక్‌ డ్రామాతో కూడిన యాక్షన్‌, థ్రిల్లర్‌ కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. మానవ అనుబంధాలతో కూడిన వైవద్యభరిత కథ ఇదని చెప్పారు. ఒకరికొకరు సంబంధం లేని వ్యక్తుల జీవితాల్లో విధి, పరిస్థితుల కారణంగా ప్రాణాలు కాపాడుకోవడానికి చేసే పోరాటమే ది ఒన్‌విత్తిన్‌ యూ అని అన్నారు. కోయంబత్తూర్‌ పశ్చిమ కొండ ప్రాంతానికి చెందిన నలుగురు యువకులు అనూహ్య సంఘటనల కారణంగా ఎలాంటి పరిణామాలను ఎదుర్కొన్నారు? వంటి ఆసక్తికరమైన అంశాలతో రూపొందిస్తున్న చిత్రం అని చెప్పారు. ఇందులో నటి లియోమోల్‌జోస్‌ నటిస్తుండగా, పరుత్తివీరన్‌ శరవణన్‌, పావల్‌ నవగీతన్‌, నమిత కృష్ణమూర్తి, గీతాకై లాసం, ప్రవీణ్‌ రాజా ముఖ్యపాత్రలు పోషిస్తున్నారని చెప్పారు. జిబ్రాన్‌ సంగీతాన్ని, వినోద్‌ రాజా చాయాగ్రహణం అందిస్తున్నారు. చిత్ర టైటిల్‌, టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించిందని త్వరలోనే ఆడియో, చిత్ర విడుదలకు సంబంధించిన వివరాల వెల్లడించనున్నట్లు యూనిట్‌ వర్గాలు పేర్కొన్నాయి.

చిత్ర పరిశ్రమలో వివక్ష ఉంది

Advertisement
 
Advertisement
Advertisement