టాస్మాక్ దుకాణం ధ్వంసం
తిరువొత్తియూరు: విల్లుపురం జిల్లా తిరువైన్నెనల్లూర్ సమీపం కడియప్పాక్కం గ్రామంలో ఉన్న టాస్మాక్ (మద్యం) దుకాణాన్ని తొలగించాలని కోరుతూ మహిళలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. పలుమార్లు విన్నవించినా అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో ఆగ్రహించిన మహిళలు, దుకాణంపై కరల్రతో దాడి చేసి వస్తువులను ధ్వంసం చేశారు. ఈ మద్యం దుకాణం పాఠశాలకు సమీపంలో ఉండటం వల్ల స్థానికులకు, విద్యార్థులకు తీవ్ర అసౌ కర్యం కలుగుతోందని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఉదయం దుకాణాన్ని తెరిచేందుకు సిబ్బంది ప్రయత్నించగా, వందలాది మంది మహిళలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో తోపులాట జరిగి ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిరసనకారులతో చర్చలు జరిపారు. సుమారు 50 మంది మహిళలపై కేసు నమోదు చేసినట్లు సమాచారం.
స్నేహితుడిని హత్య కేసులో యువకుడి అరెస్ట్
తిరువొత్తియూరు: మద్యం మత్తులో ఘర్షణ పడి స్నేహితుడిని హత్య చేసిన యువకుడిని పోలీసు లు అరెస్ట్ చేశారు. చైన్నె చోళవరానికి సమీపంలో ఉన్న వండలూర్ బైపాస్ సర్వీస్ రోడ్డులో జూన్ 5వ తేదీ రాత్రి ఒక మృతదేహం పడి ఉంది. గమనించిన స్థానికులు పోలీసులకు, 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. పరీక్షించిన వైద్యులు ఆ వ్యక్తి అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. మృతుడు చైన్నె వ్యాసార్పాడికి చెందిన మణికంఠన్ (29) అని తెలిసింది. పోలీసుల విచారణలో మణికంఠన్ తన స్నేహితులతో కలిసి మద్యం సేవించడానికి వెళ్లినట్లు తెలిసింది. ఆ సమయంలో స్నేహితుల మధ్య గొడవ జరగడంతోటింకర్ సెంథిల్ (44) అనే వ్యక్తి మణికంఠన్‌ను కర్రతో కొట్టి చంపినట్లు తెలిసింది. పోలీసులు సెంథిల్ కుమార్‌ను అరెస్ట్ చేశారు. ఈ కేసులో పరారీలో ఉన్న విక్కీ కోసం వెతుకుతున్నారు.
విద్యార్థినులకు
లైంగిక వేధింపులు
– కళాశాల యాజమాన్యంపై కేసు
తిరువొత్తియూరు: దిండుకల్ సమీపం వత్తలగుండులోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్, ఆర్ట్స్ కళాశాల హాస్టల్ వార్డెన్ సెల్‌ఫోన్ ద్వారా విద్యార్థినులకు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. సుమారు 30 మందికి పైగా విద్యార్థినులు దిండుకల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ విశాఖను కలిసి ఫిర్యాదు చేశారు. హాస్టల్‌లో కనీస వసతులు లేవని, నాణ్యత లేని ఆహారం పెడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్ వార్డెన్ రాత్రి సమయాల్లో విద్యార్థినులకు ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడుతున్నారని, లైంగికంగా వేధిస్తున్నారని విద్యార్థినులు పేర్కొన్నారు. దీనిపై గత 6 నెలలుగా కళాశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు తెలిపారు. తమను వెంటనే వేరే కళాశాలకు మార్చాలని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకో వాలని విద్యార్థినులు కోరారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ముగ్గురు వ్యక్తులపై (కళాశాల కరస్పాండెంట్, వార్డెన్ సహా) ఎస్సీ/ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం, మహిళలపై వేధింపుల నిరోధక చట్టాల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
వాకింగ్ చేస్తూ
మిద్దైపె నుంచి పడి..
– గర్భిణి మృతి
తిరువొత్తియూరు: వాకింగ్ చేస్తున్న సమయంలో మేడపై నుండి ప్రమాదవశాత్తు కిందపడి నిండు గర్భిణి ప్రాణాలు కోల్పోయిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. విల్లుపురం జిల్లా తిరువైన్నెనల్లూర్ సమీపం పెరియ సెవలై గ్రామానికి చెందిన వీరప్పన్ కుమార్తె యువశ్రీ (25). ఈమెకు, తిరువైన్నెనల్లూర్ సమీపంలోని మాంబరై గ్రామానికి చెందిన రాజదురైకి గతేడాది వివాహం జరిగింది. రాజదురై ఆర్మూర్ వద్ద ఐటిబిపి విభాగంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. గర్భిణి అయిన యువశ్రీ ప్రసవం కోసం కొన్ని రోజుల క్రితం పెరియ సెవలైలోని తన పుట్టింటికి వచ్చింది. శనివారం సాయంత్రం ఆమె తన ఇంటి మేడపై నడుస్తుండగా ఊహించని విధంగా ప్రమాదవశాత్తూ కింద పడిపోయింది. తీవ్రంగా గాయపడిన ఆమెను వెంటనే విల్లుపురం ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. అక్కడ తీవ్ర చికిత్స విభాగంలో చికిత్స పొందుతూ, శనివారం రాత్రి 11 గంటల సమయంలో చికిత్స ఫలించక యువశ్రీ , ఆమె కడుపులోని బిడ్డ ఇద్దరూ మరణించారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
మత్తుమాత్రల విక్రయం
– ఇద్దరు యువకుల అరెస్ట్
తిరువళ్లూరు: మత్తుమాత్రలను అక్రమంగా తరలించి విక్రయిస్తున్న ఇద్దరు యువకులను పోలీసులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. తిరువళ్లూరు జిల్లా ఊత్తుకోటలో మత్తుమాత్రలను విక్రయిస్తున్నట్టు స్థానిక పోలీసులకు సమాచారం అందింది. సమాచారం మేరకు సంఘటన స్థలానికి వెళ్లిన పోలీసులు మఫ్టీలో నిఘా పెట్టి అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. విచారణలో పట్టుబడిన యువకులు తాంబరం ప్రాంతానికి చెందిన రాజ్‌కుమారుడు శరవణన్(24), విశ్వనాథన్ కుమారుడు కమలేష్(23)గా గుర్తించారు. వీరు ఒడిశా నుంచి మత్తుమాత్రలను తీసుకొచ్చి యువత, విద్యార్థులే లక్ష్యంగా విక్రయిస్తున్నట్టు నిర్ధారించిన పోలీసులు వారిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.


